Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

NTR Congratulates Ram Charan

By   /  April 2, 2018  /  Comments Off on NTR Congratulates Ram Charan

    Print       Email

చిట్టిబాబుకు జూనియ‌ర్ హ్యాట్సాఫ్‌

InCorpTaxAct
Suvidha

 

 

 

 

 

* అద్భుతంగా న‌టించారంటూ ప్ర‌శంస‌లు

* రంగ‌స్థ‌లం యూనిట్‌కు ప్ర‌ముఖుల నుంచి అభినంద‌న‌ల వెల్లువ‌

డెక్క‌న్ అబ్రాడ్‌: రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’. విడుదలైన రోజు నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం కలెక్షన్లలోనూ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని చూసిన పలువురు సెలబ్రిటీలు సినిమాపై తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు. వారి లిస్ట్‌లో తాజాగా జూనియర్ ఎన్టీఆర్ చేరిపోయారు. రంగస్థలంను చూసిన ఎన్టీఆర్, ట్విట్టర్‌లో.. “ఇప్పుడే రంగస్థలం చూశాను. చరణ్ నీకు హ్యాట్సాఫ్‌. అందరి దగ్గర ప్రశంసలు పొందేందుకు నువ్వు అర్హుడివి. అందులో భాగంగా ఇప్పుడు నా ప్రశంసలు కూడా తీసుకో. చిట్టిబాబు పాత్రలో నీ కన్నా ఎవరూ బాగా చేయలేరు.

అద్భుతమైన దర్శకత్వం చేసిన సుకుమార్‌కు హ్యాట్సాఫ్. ఇంత మంచి ఎమోషనల్ డ్రామాను మీరు చాలా బాగా తెరకెక్కించారు. సమంత, దేవీ శ్రీ ప్రసాద్, మైత్రీ మూవీ మేకర్స్ అలాగే ఈ చిత్రంలో భాగమైన ప్రతి ఒక్కరికీ కంగ్రాట్స్. మీ అందరి కృషి లేకపోతే ఈ చిత్రం ఇలా వచ్చేది కాదు. అందరూ చాలా బాగా చేశారు” అంటూ తన అభిప్రాయాన్ని తెలిపారు. ఇక దీనికి “థ్యాంక్యు బ్రదర్ ఎన్టీఆర్” అంటూ సమాధానం ఇచ్చారు. కాగా ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించనున్న భారీ బడ్జెట్ చిత్రం ఈ సంవత్సరం ఏడాదిలో తెరకెక్కనున్న విషయం తెలిసిందే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →