Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

NTR is taking six months break

By   /  October 5, 2017  /  Comments Off on NTR is taking six months break

    Print       Email

ఎన్టీఆర్ 6 నెలలు బ్రేక్..!

 

InCorpTaxAct
Suvidha

 

 

దసరాకి జై లవ కుశ అంటూ ప్రేక్షకులను అలరించిన ఎన్.టి.ఆర్ మూడు విభిన్న పాత్రలలో అదరగొట్టేశాడు. ముఖ్యంగా సినిమాలో జై పాత్రకు ఎన్.టి.ఆర్ తన నటవిశ్వరూపం చూపించాడని చెప్పాలి. బాబి డైరక్షన్ లో వచ్చిన జై లవ కుశ తారక్ కెరియర్ లో హయ్యెస్ట్ కలక్షన్స్ తెచ్చుకున్న మూవీగా సంచలనం సృష్టిస్తుంది. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో నందమూరి కళ్యాణ్ రాం నిర్మించిన ఈ సినిమాలో రాశి ఖన్నా, నివేథా థామస్ లు హీరోయిన్స్ గా నటించారు.

ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రం సినిమా ఫిక్స్ చేసుకున్న తారక్ ఆ సినిమా కోసం 6 నెలల దాకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం త్రివిక్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నాడు. అజ్ఞాతవాసి అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమా షూటింగ్ ఈపాటికి పూర్తి కావాల్సింది కాని అనివార్య కారణాల వల్ల పూర్తి కాలేదు. ఈ సినిమా నవంబర్, డిసెంబర్ కల్లా పూర్తవుతుందట. సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. పవన్ సినిమా రిలీజ్ తర్వాతే త్రివిక్రం ఎన్.టి.ఆర్ తో సినిమా చేస్తాడు. సో చూస్తుంటే వీరి కాంబోలో మూవీ మార్చిలో మొదలయ్యే అవకాశాలున్నాయని తెలుస్తుంది. హిట్ ఫాం లో ఉన్న తారక్ హాఫ్ ఇయర్ సినిమా కమిట్ అయి కూడా ఖాళీగా ఉండటం ఫ్యాన్స్ కు మింగుడు పడట్లేదు. అయితే ఈ గ్యాప్ లో ఫ్యామిలీతో జాలీ ట్రిప్ వేయాలని ప్లాన్ చేసుకున్నాడట జూనియర్.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →