ఓం అన్నది ఒక శబ్ధంగా చెప్పుకున్నపుడు ఆత్మతో తాదాత్మ్యమ్ చెప్పుకోవాలి. ఇక భాగాలుగా చెప్పుకున్నపుడు అవి అ,ఉ,మ. ఇది గాఢమైన ద్యానాన్ని సూచిస్తుంది. దీనికి “ఓం” దాని అంశాలైన అ,ఉ,మ లుగా విభజించి వాటికి ఆయా అవస్థలతో తాదాత్మ్యమ్ చెప్పబడుతుందని దీని భావం.
జాగ్రదవస్థ , సంచార స్థానంగా గల వైస్వానరుడు ఓంకారంలో మొదటి అంశమైన ‘అకారం’. ఎందుకంటే అకారము వైస్వానరుడు రెండు కూడా సర్వత్రా వ్యాపించి ఉండేవి, ఆది ఉన్నవే.
స్వాప్నికావస్థ సంచారస్థానంగా ఉన్న తైజసుడు ఓంకారంలో రెండవ అంశమైన ‘ఉకార౦’. ఈ తైజసుడు, ఉకారము మధ్యలో ఉండడం చేత ఇవి రెండూ శ్రేష్టమని తెలియుచున్నది. ఈ విషయం తెలుసుకున్న వాని జ్ఞానం వర్ధిల్లుతుంది, అతడు అందరికి సమానుడగుతాడు.
సుషుప్తి సంచార స్థానంగా కలిగిన ప్రాజ్ఞుడు ఓంకారంలోని మూడవ మాత్ర ఐన మకారానికి సారూప్యంగా చెప్పబడుతోంది. ఇవి రెండూ కూడా మిగిలిన వాటి కొలతను చూస్తాయి మరియు వాటిని తమలో లీనంగావించుకుంటాయి. ఇది తెలుసుకున్నవారు అన్నిటిని కొలతను చూడటమే గాక తమలో లీనం చేసుకోగలుగుతారు.
ఇక ఏ అంశాలులేని ‘ఓంకారం’ నాల్గవ స్థితి అయిన తురీయంగా చెప్పబడినది. అది సర్వాతీతమైన, నిర్వికారమైన పరమానందం అద్వైతం. ఈ ప్రకారంగా ఓంకారమే ఆత్మగా తెలియనగును. ఈ క్రమాన్ని తెలుసుకున్నవాడు ఓంకార ధ్యానం ద్వారా తన ఆత్మను పరమాత్మలో లీనం చేసుకోగలుగుతాడు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.