Loading...
You are here:  Home  >  Politics  >  Delhi Politics  >  Current Article

One More Congress MP & MLA moved to TRS

By   /  June 4, 2016  /  Comments Off on One More Congress MP & MLA moved to TRS

    Print       Email

congress-logoటీఆర్ఎస్‌లోకి మ‌రో ఎంపీ..ఎమ్మెల్యే?

 

InCorpTaxAct
Suvidha

 

 

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ దాటికి మ‌రేపార్టీ నిలిచే ప‌రిస్థితి లేకుండా పోయింది. అయితే కాంగ్రెస్ పార్టీ కాస్తూ.. కూస్తో నిల‌బ‌డింది కానీ.. ఇటీవ‌ల ప‌రిణామాలు చూస్తా ఉంటే ఆ పార్టీ ప‌రిస్థితి కూడా అంత మంచిగా ఉండేట‌ట్లు లేదు. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు కారెక్కేయగా ఇదే కోవలో మరో ఎంపీ – ఎమ్మెల్యే కూడా గులాబి గూటికి చేరుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు టీ పాలిటిక్స్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా న‌ల్గొండ జిల్లా వ‌ర‌కు చూస్తే ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మంచి ప‌ట్టు ఉంది. కొద్ది రోజుల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎమ్మెల్సీ స్థానంలో విజయం సాధించింది కూడా. నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించి తెలంగాణలో తిరుగులేని విజయాలతో దూసుకెళుతున్న టీఆర్ ఎస్ సర్కార్ కు దూకుడుకు బ్రేకులేసి అందరిని ఆకర్షించారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ సంస్థాగతంగా చాలా బలంగా ఉన్న ఈ జిల్లా నుంచి ఓ ఎంపీ – ఎమ్మెల్యే ఇప్పుడు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారన్న వార్తలు ఆ పార్టీ నాయకుల్లో కలకలం రేపుతున్నాయి. నల్గొండ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి – మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు టీఆర్ ఎస్ లో చేరుతున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరు కేసీఆర్ ను కలవడంతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే వీరు పార్టీ మారతారన్న అనుమానాలు కాంగ్రెస్ నేతలే వ్యక్తం  చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రిస్థితులు చూస్తా ఉంటే ఇప్ప‌టికే ఖాళీ అయిన టీడీపీ, వైసీపీ స‌ర‌స‌న కాంగ్రెస్ పార్టీ కూడా చేరుతుందేమోన‌న్న అనుమానం క‌లగ‌క మాన‌దు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →