Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Only three MPs left in Telangana – KCR

By   /  June 17, 2016  /  Comments Off on Only three MPs left in Telangana – KCR

    Print       Email

ఇక మిగిలింది ముగ్గురే!2014-12-10_192127_KCR_HYd

 

InCorpTaxAct
Suvidha

 

 

ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌తో తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు కాంగ్రెస్‌, టీడీపీ, వైసీపీ పార్టీల‌కు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేను పార్టీలోకి ఆహ్వానిస్తూ ప్ర‌తిప‌క్ష పార్టీల్లో స‌భ్యులే లేకుండా చేస్తున్నారు. దఫాదఫాలుగా ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ను కొనసాగిస్తూ ఆయా పార్టీల ఎంపీలను కారెక్కించడం ద్వారా కేసీఆర్ నూతన రికార్డు సృష్టించారు. తెలంగాణలో టీఆర్ ఎస్ మినహా మూడు పార్టీలు మాత్రమే ప్రాతినిద్యం వహించేలా అదికూడా ఒక్కో ఎంపీ మాత్రమే ఉండేలా చక్రం తిప్పారు. తెలంగాణకున్న మొత్తం 17 ఎంపీ సీట్లలో 2014 ఎన్నికల్లో టీఆర్ ఎస్ 11 సీట్లు గెలిచింది. అనంతరం ఖమ్మం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున గెలిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి – మల్కాజ్ గిరి టీడీపీ ఎంపీ మల్లారెడ్డి కూడా టీఆర్ ఎస్ లో చేరారు. తాజాగా నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సైతం కారెక్కేశారు.

మొత్తంగా టీఆర్ ఎస్ 14 సీట్లతో మరింత బలం పెంచుకుంటే తెలంగాణ రాష్ట్రం నుంచి మిగతా మూడు సీట్లలో పార్టీకొక్కరు చొప్పున ముగ్గురు లోక్ సభ సభ్యులే ఉన్నారు. కాంగ్రెస్ తరఫున నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా గెలిచిన నంది ఎల్లయ్య – బీజేపీకి సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ – మజ్లిస్ తరఫున హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లోక్ సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొత్తంగా రెండు సీట్లు గెలిచిన కాంగ్రెస్ ఒక్క స్థానానికి – ఒక్కోసీటు గెలిచిన టీడీపీ – వైసీపీ పార్లమెంటు సభ్యులే లేకుండా చేయడంలో కేసీఆర్ చాణక్యం ఫలించిందని అంటున్నారు. ఎమ్మెల్యేల విషయంలో వేసిన ఎత్తుగడలకే ప్రతిపక్షాలు కకావికలం అయితే ఇపుడది ఎంపీల వరకు కూడా చేరిందని చర్చించుకుంటున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →