ఇప్పట్లో మోదీని కొట్టగలితే నేత ఎవ్వరూ లేరు: ఒమర్ అబ్దుల్లా
యూపీలో బీజేపీ సునామీ సృష్టించిందని జమ్మూకశ్మీర్ కు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ నేత మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఇక ప్రతిపక్షాలు 2019 ఎన్నికల గురించి ఆలోచిండం మానేయాలని సూచించారు. విపక్షాలు అన్ని 2024 ఎన్నికలే టార్గెట్ గా ఉండాలని సూచించారు. ప్రస్తుతం దేశంలో మోదీతో ఢీకొట్టే సత్తా గల నాయకుడు లేనేలేడని అన్నారు. యూపీలో బీజేపీ ముందంజలో ఉండగా ఆయన ట్విట్టర్ ద్వారా ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశంలోని విపక్షాలు అన్నీ ఇప్పటి నుంచే 2024 ఎన్నికల కోసం సిద్దం కావాలని సూచించారు. ఇప్పటినుంచి ప్రయత్నిస్తే అప్పటికి బీజేపీకి బలమైన పోటీదారులుగా మారే అవకాశం ఉందన్నారు.ఈ రిజల్ట్స్ ను బట్టి ఇప్పట్లో బీజేపీకి ఎవరూ పోటీ ఇవ్వలేరని అన్నారు. ‘ఈ రిజల్ట్స్ చిన్న చిన్న చెరువుల్లో వచ్చే అలలు లాంటివి కాదు.. వాస్తవానికి ఇది పెద్ద సునామీ. దీన్ని రాజకీయ విశ్లేషకులు ఎలా మర్చిపోయారు’ అని అన్నారు. ఓటర్లు ఖచ్చితమైన తీర్పును ఇచ్చారు. తమను అభివృద్ధి చేస్తారని భావించిన వారికి పట్టం కట్టారని అభిప్రాయ పడ్డారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.