ఆస్కార్ రెడ్ కార్పెట్ పై మెరిసిన ప్రియాంక..!
అమెరికాలోని లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్లో 88వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఆస్కార్ వేదికపై బాలీవుడ్ నటీమణి ప్రియాంక చోప్రా మెరిసింది. వైట్ షౌల్డర్ గౌనులో స్టన్నింగ్ లుక్ తో ఈ అమ్మడు అదరగొట్టింది. ప్రియాంక 88వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో బాలీవుడ్ స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించింది. గోల్డెన్ బ్రౌన్ స్మోకీ ఐస్, స్ట్రాప్ లెస్ వైటు గౌనుతో రెడ్ కార్పెట్ మీద పర్ఫెక్ట్ పోజుతో మతిపోగొట్టింది. అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా.. అక్కడే ఉన్న ఓ యాంకర్ తో కాసేపు చిట్ చాట్ మాట్లాడారు. తన దృష్టిలో బాలీవుడ్ కి హాలీవుడ్ కి పెద్దగా తేడాలేదన్నారు. రెండు ఇండస్ట్రీలు సూపర్ లా దూసుకెళ్తున్నాయన్నారు.
రెడ్ కార్పెట్ మీద పర్ఫెక్ట్ పోజు ఎలా ఉండాలని అడిగితే.. ఈ ‘క్వాటింకో’ బ్యూటీ ‘ఎస్’ ఆకృతిలో ఒదిగిపోయి.. ఇదిగో ఇలా అంటూ హోయలు పోయింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ జుహైర్ మురాద్ డిజైన్ చేసిన తెల్లని గౌనును ప్రియాంక ధరించారు.. చెవులకు వేలాడే డైమండ్ డ్రాప్ ఇయర్ రింగ్స్, చేతికి ఉంగరం ధరించారు. జుట్టును పోనీగా చేసుకొని వెనక్కి కట్టేశారు. డైమండ్స్ అమ్మాయిల బెస్ట్ ఫ్రెండ్ అంటూ రెడ్ కార్పెట్ పై దిగిన ఓ ఫొటోని ప్రియాంక ఇన్ స్టా గ్రామ్ లో అభిమానులతో పంచుకున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.