టార్గెట్`గులాబి`
ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా తామే గెలుపని తెలంగాణ ప్రభుత్వం ఢంకా భజాయిస్తుంటే.. విపక్షాలు మాత్రం అంత ఈజీ కాదని హెచ్చరిస్తున్నాయి. ఎలాగైనా తెలంగాణ పార్టీకి గుణపాఠం చెప్పాలని చూస్తున్న విపక్షాలను అన్నీ ఒకతాటిపైకి తెచ్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు మంతనాలు చేస్తున్నారు. ఇప్పటికై మల్లు భట్టి విక్రమార్క వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి తమకు మద్దతు ఇవ్వాలని కోరగా పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం చెబుతామని చెప్పారు. కమ్యూనిస్టు పార్టీలను కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరనున్నట్లు సమాచారం. పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఉమార్ రెడ్డి టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణతో మాట్లాడగా ఆయన చంద్రబాబుకు విషయాన్ని చెబుతామని, ఆయన నిర్ణయమే ఫైనల్ అని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రయత్నాలను అధికార టిఆర్ఎస్ పార్టీ ఆసక్తిగా గమనిస్తోంది. అన్ని జిల్లాలతో పోల్చితే ఖమ్మం రాజకీయాలు కాస్తా డిఫరెంట్ గానే ఉంటాయంటున్న టిఆర్ఎస్ నేతలు ప్రభుత్వ సంక్షేమ పథకాలపైనే ఆశలు పెట్టుకున్నారు. కాగా పాలేరు నియోజకవర్గంలోనే మకాం వేసిన రాంరెడ్డి వెంకట్రెడ్డి కుటుంబ సభ్యులు స్థానిక నేతలు, వివిధ సంఘాలతో సమావేశమవుతున్నారు. సానుభూతిని ఓట్ల రూపంలో మలుచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు తెలంగాణ సర్కార్ చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలనే తమను గెలిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణలో ఉన్నఅన్ని పార్టీల టార్గట్ మాత్రం తెలంగాణ ప్రభుత్వమే అని చెప్పాలి. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ సర్కార్ విజయం అంత ఈజీ కాదనేది తెలుస్తోంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.