టీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్ ఆదేశం
టీఆర్ఎస్ అభ్యర్థిగా తుమ్మల పేరు ఖరారు
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం టీఆర్ఎస్ ఖైవసం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆ పార్టీ నేతలకు సూచించారు. ఎవరు బరిలో ఉన్నా విజయం మనదే కావాలన్నారు. 2014లో పాలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి పీఏసీ చైర్మన్ పదవి చేపట్టిన రాంరెడ్డి వెంకట్‌రెడ్డి ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన నేపథ్యంలో జరుగుతున్న ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆ పార్టీ ప్రకటించింది. కాగా ప్రస్తుతం శాసనమండలి సభ్యుడిగా ఉన్న తుమ్మలను పోటీ చేయాలని సీఎం కేసీఆర్ కోరడంతో ఆయన కూడా ఓకే చెప్పేశారు. ఈ ఉపఎన్నికకు పార్టీ ఇన్‌చార్జ్జి బాధ్యతను రాష్ట్ర ఐటీ, పురపాలక, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు అప్పగించడం విశేషం.
అయితే పాలేరు ఉప ఎన్నికల బరిలో అన్ని పార్టీలు పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా కాంగ్రెస్ పార్టీ నుంచి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి సతీమణి సుచరితారెడ్డిని నిలబెట్టాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ కూడా తమ అభ్యర్థిని నిలబెట్టాలని యోచిస్తున్నట్లుతెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో టీడీపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. సీపీఎం, సీపీఐ పార్టీలు కూడా పాలేరు బరిలో నిలబడేందుకు సిద్ధమయ్యాయి. సీపీఎం తరపునుంచి పోతినేని సుదర్శన్ ను నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీపీఐ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ అభ్యర్థి ఎవరనేది ఇంకా తేలలేదు. అయితే పాలేరు ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలని కాంగ్రెస్‌పార్టీ ముందుగా అనుకుని సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ అడిగి కూడా తర్వాత ఎందుకు వెనక్కి వెళ్లినట్లు తెలుస్తోంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.