అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఏపీ.. పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శలు..
ఏపీని అప్పుల ఊబిలో ముంచేశారని పీఏసీ చైర్మన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 2014 వరకు ఏపీ అప్పులు రూ.1.20 లక్షల కోట్ల మేర ఉన్నాయని అన్నారు. తాజాగా దీన్ని ఏకంగా రూ. 2.17 లక్షల కోట్లకు పెంచేశారని అన్నారు. ఈ వ్యత్యాసం అంతా కేవలం దుబారా ఖర్చుల కోసమే జరిగిందని అన్నారు.ఇది అత్యంత ఆందోళన కలిగించే అంశమని అన్నారు.ఈయన వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు.
‘1994కి ముందు జీఎస్డీపీలో 21 శాతం అప్పుఉంది. అనంతరం వచ్చిన చంద్రబాబు తన హయాంలో ఏకంగా 32 శాతానికి పెంచేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు అప్పులను 21 శాతానికి తగ్గించింది. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక అప్పుల్ని మళ్లీ 32 శాతానికి తీసుకెళ్ళారు. దీంతో చంద్రబాబు పాలన అంతా అప్పులమయం’ అంటూ విమర్శలు గుప్పించారు. పట్టిసీమపై చాటింపు వేసుకుంటున్న చంద్రబాబు సర్కారు కాగ్ నివేదికపై ఏం సమాధానం చెబుతుందో చూడాలని అన్నారు. అంచనా వ్యయాన్ని రూ.400కోట్లకు పైగా పెంచారని అన్నారు. రూ.199 కోట్లు వేస్ట్ గా ఖర్చు చేశారని విమర్శించారు.తక్కువ రకం బొగ్గు కొనుగోలుతో జెన్కో రూ.918 కోట్లు నష్టపోయిందని కాగ్ తప్పుబట్టిందని అన్నారు. హెలికాప్టర్ల అద్దె చెల్లింపుల్లోనూ ప్రభుత్వం తప్పుచేసిందని కాగ్ చెప్పిందని అన్నారు. దీనిపై చంద్రబాబు సమాధానం చెప్పాలని అన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.