ఆత్మరక్షణలో పాకిస్థాన్..!
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైనికుల మెరుపుదాడి చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఆర్మీ ఆత్మరక్షణలో పడింది. ఉగ్ర శిబిరాలను కొత్త ప్రాంతాలను తరలించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్ నుంచి మన్షేరా, నౌషేరా, జీలం ప్రాంతాలకు ఉగ్రవాద శిక్షణా శిబిరాలను తరలించినట్టు భారత నిఘా వర్గాలు పసికట్టాయి. ఈ క్యాంపుల్లో లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన 500 మంది శిక్షణ పొందుతున్నారు. వీరిలో ఎక్కువ మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఉన్నట్లుగా భారత నిఘా వర్గాలు గుర్తించాయి. పాక్ ఆక్రమి కశ్మీర్‌లోని మ్యూరే, రావాల్కోట్లోని 7 ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆర్మీ మెరుపు దాడులు చేయడంతో పాక్ తరలింపు చేపట్టింది.
భారత్ కు మద్దతు పలికిన సార్క్ దేశాలు..!
భారత్ ఆర్మీ కొట్టిన దెబ్బకు పాక్ కు గట్టి షాక్ తగిలింది. యూరీ సెక్టార్ లోని ఆర్మీ బేస్ క్యాంప్ పై దాడుల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. సార్క్ సదస్సుకు హాజరయ్యేది లేదని తేల్చి చెప్పారు. దీంతో భూటాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాలు తాము కూడా భారత్ వెంటే తాము కూడా ఉన్నట్లు స్పష్టం చేశాయి. అంతేకాకుండా పాక్ ఉగ్రవాదానికి కొమ్ముకాయడం మానుకోవాలని గట్టిగా హెచ్చరించాయి. అంతేకాకుండా తాము కూడా సార్క్ సదస్సుకు హాజరయ్యేది లేదని తేల్చి చెప్పాయి. అలాగే శ్రీలంక, మాల్దీవులు కూడా భారత్ కు మద్దతు ప్రకటించాయి. తాము కూడా సార్క్ సదస్సుకు వచ్చేది లేదని తేల్చేశాయి.
పాక్ ను హెచ్చరించిన పెద్దన్న..!
భారత్ – పాక్ సరిహద్దుల్లో పాక్ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. 36 గంటల వ్యవధిలో మూడోసారి కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్ అక్నూర్ సెక్టార్‌లోకి కాల్పులు జరిపింది. భారత సరిహద్దుల్లోకి మోర్టార్లుతో దాడి చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా పాక్ ను తీవ్రంగా హెచ్చరించింది. యుద్ధం వస్తే భారత్‌పై అణ్వాయుధాలు ప్రయోగించక తప్పదన్న పాకిస్థాన్ రక్షణ మంత్రి మహ్మద్ ఖ్వాజా ఆసిఫ్ ప్రకటనను తీవ్రంగా తప్పుపట్టింది. ఆసిఫ్ ప్రకటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేగాకుండా అమెరికా ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. అణ్వాయుధాలతో భారత్‌ను సర్వనాశనం చేస్తామని ఆసిఫ్ హెచ్చరించడంపై అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కేవలం అసహనంతో పాక్ ఈ ప్రకటన చేసిందని అమెరికా విమర్శలు గుప్పించింది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.