Loading...
You are here:  Home  >  World News  >  Asia News  >  Current Article

Pak PM Nawaj Sharif Sensational Comments On Kashmir..

By   /  October 10, 2016  /  Comments Off on Pak PM Nawaj Sharif Sensational Comments On Kashmir..

    Print       Email

nawaj-sharifకశ్మీర్ అంశంపై పాక్ ప్రధాని షరీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు..

కశ్మీర్ అంశంలో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ కు సాయం చేయకుండా తమను ఏ శక్తి అడ్డుకోలేదని అన్నారు. కశ్మీరీలు స్వాతంత్య్ర పోరాటం చేస్తున్నారని అన్నారు. దీన్ని భారత్ ఉగ్రవాదంగా పరిగణిస్తోందన్నారు. ఈ మేరకు ఆయన ఓ సమావేశంలో వ్యాఖ్యానించారు. సోమవారం నిర్వహించిన పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్) సెంట్రల్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) మీటింగ్‌లో షరీఫ్ పాల్గోన్నారు.ఈ సందర్భంగా షరీఫ్ పై వ్యాఖ్యలు చేశారు.

InCorpTaxAct
Suvidha

హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీని చంపేసిన తర్వాత భారత దళాలు ఏకంగా వందమంది కశ్మీరీ నిరసనకారులను మట్టుబెట్టాయని ఆరోపణలు గుప్పించారు. ఈ ఘటనతో రెండు అణుసామర్థ్యం కలిగిన దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయన్నారు. అంతేగాకుండా పాక్.. ఉగ్రవాదం సహా ఇతర అన్ని సవాళ్లను అధిగమిస్తుందన్నారు. చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్(సీపీఈసీ)తో అత్యధికంగా లాభపడేది బలూచిస్థాన్ మాత్రమేనని అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →