Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

Pakistan given heavy target 339 to India..

By   /  June 19, 2017  /  Comments Off on Pakistan given heavy target 339 to India..

    Print       Email

చెలరేగిన పాక్ బ్యాట్స్ మెన్.. పేలవ ప్రదర్శన చేసిన భారత బౌలర్లు..

 

EIS
EnGeniusInc

 
భారత్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో భారీ తేడాతో ఓడిపోయిన పాకిస్థాన్ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. అంతేకాదు.. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో భారత్ ముందు భారీ టార్గెట్ ను ఉంచింది. ఓవల్ లో జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్ ఓపెనర్లు మొదటి నుంచి ధాటిగా ఆడారు. వారికి బ్యాటింగ్ ముందు భారత బౌలర్లు తేలిపోయారు. పొడి పిచ్ పై స్పిన్నర్లు, పేపర్లు బౌలింగ్ చేసేందుకు నానా కష్టాలుపడ్డారు.

ఇక పాక్ వికెట్లు తీసేందుకు బౌలర్లు బాగా శ్రమించాల్సి వచ్చింది. కొన్ని తప్పిదాల కారణంగా భారత్ భారీ స్కోర్ సమర్పించుకోవాల్సి వచ్చింది. నాలుగో ఓవర్ తొలి బంతికే ఓపెనర్ ఫఖర్ జమాన్ అవుటైనా నోబాల్ కారణంగా ఆటను కొనసాగించాడు. అప్పటికి ఫఖర్ డబుల్ డిజిట్ రన్స్ కూడా చేయలేదు.ఇక లైఫ్ రావడంతో అతను రెచ్చిపోయి ఆడాడు.చెలరేగిఆడి సెంచరీ చేశాడు. మొత్తం 106 బంతులు ఎదుర్కొన్న ఫఖర్ 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 114 రన్స్ చేశాడు.

మరో ఓపెనర్ అజర్ అలీ 59 పరుగులు.. బాబర్ ఆజం 46.. షోయబ్ మాలిక్ 12 చేశారు. చివరిగా మొహమ్మద్ హఫీజ్ 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57 రన్స్ చేసి స్కోర్ బోర్డ్ ను పరిగెత్తించాడు. ఇమాద్ వాసిమ్ 25 రన్స్ చేశాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో పాక్ 4 వికెట్ల నష్టానికి 338 రన్స్ చేసింది. భారత బౌలర్లలో భవనేశ్వర్ కుమార్, హార్ధిక్ పాండ్యా, కేదార్ జాదవ్ చెరో వికెట్ తీసుకున్నారు.

Charter Global
InfoSmart
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

In RK Nagar support increases for DMK – former minister KN Nehru

Read More →