Loading...
You are here:  Home  >  World News  >  Asia News  >  Current Article

Pakistan Police Searching For Terrorists

By   /  October 10, 2016  /  Comments Off on Pakistan Police Searching For Terrorists

    Print       Email

pakistan-police-searching-for-terrorists2పాక్ లో మిస్ అయిన టెర్రరిస్టుల కోసం తీవ్రంగా గాలింపు..

కొద్ది రోజులుగా పాక్ మిస్ అయిన పలువురు ఉగ్రవాదులు కోసం రావల్సిండి పోలీసులు తీవ్రంగా వెతుకుతున్నారు. వీరు సుమారుగా వందమంది ఉంటారని భావిస్తున్నారు. ముహర్రం సందర్భంగా జరిగే ప్రార్ధనల్లో ఈ ఉగ్రవాదులు పేలుళ్ళకు పాల్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో వారికి త్వరగా వెతికి పట్టుకోవాలని శ్రమిస్తున్నారు. ఈ మేరకు హోంశాఖ పోలీసులను ఆదేశించింది. త్వరగా ఉగ్రవాదులను పట్టుకోకపోతే భారీ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని పంజాబ్ హోం శాఖ అనుమానం వ్యక్తం చేస్తోంది. 2013లో ఉగ్రవాదులు రాజాబజార్ లో విధ్వంసం సృష్టించారు. మళ్లీ అలాంటి ఘటనలకు పాల్పడే అవకాశం ఉందని అనుమానంతో పోలీసులపై ఒత్తిడి తెచ్చారు.అప్పటి ఘటనలో ఏకంగా 13 మంది సామాన్య పౌరులు మృత్యువాతపడ్డారు.
భవాల్పూర్, ఫైసలాబాద్, ముల్తాన్, రావల్పిండి, డేరా ఘజిఖాన్ డివిజన్లకు చెందిన 102 మంది ఉగ్రవాదులు కనిపించకుండా పోయారు. దీంతో ముహర్రం సందర్భంగా వారు దాడులకు స్కెచ్ వేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వీలైనంత త్వరగా వారిని వెతికిపట్టుకుని ప్రాణ నష్టాన్ని నివారించాలని ఉన్నతాధికారుల నుంచి పోలీసులకు ఆదేశాలు వచ్చాయి. మరోవైపు.. మిస్సింగ్ మిలిటెంట్లపై దృష్టిసారించి వారిని అదుపు తీసుకోవాలంటూ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలను కూడా హోంశాఖ ఆదేశించింది.

InCorpTaxAct
Suvidha
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →