Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Paleru elections: All parties are deliberately attacking each other

By   /  May 12, 2016  /  Comments Off on Paleru elections: All parties are deliberately attacking each other

    Print       Email

all partyపాలేరు ప్ర‌చారంలో పేలుతున్న మాట‌ల తూటాలు

 

InCorpTaxAct
Suvidha

 

 

ఖ‌మ్మం జిల్లా పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌ను అన్ని పార్టీలు కూడా చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ కి ఈ ఎన్నిక ఇజ్జ‌త్‌కా స‌వాల్‌.  అందుకే అన్ని పార్టీల నాయ‌కులు కూడా మంచి వాక్‌చారుత్యం క‌లిగిన నాయ‌కుల‌ను ఎన్నిక‌ల ప్ర‌చారంలో దింపుతున్నారు. దీంతో ఉప ఎన్నిక ప్ర‌చార  కార్య‌క్ర‌మాల్లో నాయ‌కులు మాట‌ల తూటాల‌ను పేల్చుతున్నారు. ఒక‌రికొక‌రు స‌వాళ్లు.. ప్ర‌తిస‌వాళ్లు ఇసురుకుంటున్నారు.  అధికార.. విపక్షాలు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. మీది నీచ సంస్కృతి అని తెలంగాణ  ప్ర‌భుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ స‌భ్యులు విమ‌ర్శిస్తే.. కాదు..కాదు మీదే నీచ సంస్కృతి అని మంత్రి కేటీఆర్ దుయ్య‌బ‌డుతున్నారు. అందుకు కొన్ని ఉదాహ‌ర‌ణ‌లుకూడా చెప్పారు. కాక‌పోతే ప్ర‌స్తుతం పాలేరు ఉప ఎన్నిక నేప‌థ్యంలో ఆర్ ఎస్ ఫైర్ బ్రాండ్ గా.. తన మాటలతో ముచ్చమటలు పోయించే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాలేరు ఉప ఎన్నిక ప్రచారంలోకి అడుగు పెట్టనున్నారు.

తెలుగుదేశం పార్టీ అంటే చాలు.. అంతెత్తున ఎగిరిపడే ఆయన కానీ ప్రచారంలోకి దిగితే ఆయన మాటలు ఎలా పేలతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉంటే.. ఈ ఉప ఎన్నికల్లో విపక్షాల తరఫున తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేత.. కేసీఆర్ అండ్ కో అంటే చాలు చెలరేగిపోయే ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి సైతం బుధవారం నుంచి పాలేరు ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొననున్నారు. వీరే కాక.. రేవంత్ కు తోడుగా టీడీపీ నేతలు నామా నాగేశ్వరరావు.. సండ్ర వెంకట వీరయ్యలు కూడా ప్రచారం చేయనున్నారు. దీంతో నాయ‌కులు చేసే ప్ర‌చారాల‌ను ప్ర‌జ‌లు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. అంతేకాదు వాళ్లుమాట్లాడే మాట‌ల‌ను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →