Loading...
You are here:  Home  >  Movies  >  Bollywood  >  Current Article

PanamaPapersIndia Part 2: Politician, industrialist, jeweller

By   /  April 5, 2016  /  Comments Off on PanamaPapersIndia Part 2: Politician, industrialist, jeweller

    Print       Email

aishwarya-rai-amitabh-bachchan-759

నల్లకుబేరుల లిస్ట్ లో మరింతమంది భారతీయులు.. !

InCorpTaxAct
Suvidha

 
పనామా పేపర్స్‌తో రిలీజ్ చేసిన నల్ల కుబేరుల్లో 500 మంది ఇండియన్స్ ఉన్న సంగతి తెలిసిందే. మళ్లీ వారిలో మరికొందరి పేర్లు బహిర్గతం అయ్యాయి. నిన్న బాలీవుడ్‌ ప్రముఖులు అమితాబ్‌ బచ్చన్‌, ఐశ్వర్యారాయ్‌ సహా మరికొందరి పేర్లు వెల్లడైన విషయం తెలిసిందే. ఇవాళ మరికొందరి పేర్లు బయటపడ్డాయి.. ఆ లిస్ట్ మీకోసం..

1. అశ్వని కుమార్‌ మెహతా

1999 నుంచి ఈయన కుటుంబ సభ్యుల పేర్లతో కరీబియన్‌ దీవులు.. బ్రిటిష్‌ వర్జిన్‌ దీవుల్లో 7 ఆఫ్‌షోర్‌ సంస్థలు రిజిస్టర్ అయి ఉన్నట్లు తెలింది మెహతా ఆయన భార్య, ఇద్దరు కుమారుల పేర్ల మీదే కాకుండా కోడళ్లను కూడా డైరెక్టర్లుగా పేర్కొన్నట్లు మొసాక్‌ ఫొన్సెకా పత్రాల్లో తేటతెల్లమైంది.

2. అనురాగ్‌ కేజ్రీవాల్‌

బ్రిటిష్‌ వర్జిన్‌ దీవుల్లో మూడు సంస్థలతో పాటు పనామాలో రెండు ప్రైవేటు ఫౌండేషన్లకు ఆయన డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు రికార్డులు చెబుతున్నాయి. నెవింగ్టన్‌ గ్రూప్‌ ట్రేడింగ్‌ లిమిటెడ్‌, నెడ్‌స్టార్‌ కమర్షియల్‌ లిమిటెడ్‌, క్రిమ్స్‌ ఇన్వెస్టిమెంట్స్‌ ఇన్‌కార్పొరేట్‌ అనే సంస్థలు బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లో రిజిస్టర్ అయి ఉన్నట్లు తెలిసింది.

3. గౌతమ్‌ మరియు కరన్‌ థాపర్‌

క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ సంస్థకు చెందిన వ్యక్తులు. వీళ్లకి పనామాలో చార్ల్‌వుడ్‌, నికామ్‌ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్స్ ఉన్నాయి. 2005 జులైలో చార్ల్‌వుడ్‌ ఫౌండేషన్‌ను 10వేల అమెరికన్‌ డాలర్లతో ప్రారంభించినట్లు పత్రాల్లో తేలిసింది. అదే ఏడాది అక్టోబర్‌లో నికామ్‌ ఇంటర్నేషనల్‌ను కూడా స్థాపించారట.

4. సతీష్‌ గోవింద్‌ సాంతాని, విష్లావ్‌ బహదూర్‌, హరీశ్‌ మొహ్నాని

బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లో రెండు సంస్థలకు ఈ ముగ్గురు డైరెక్టర్లుగా ఉన్నారు. 2008 డిసెంబర్‌ 4న డిజైన్‌ అండ్‌ క్వాలిటీ లిమిటెడ్‌, 2007 నవంబర్‌లో త్రిలియాన్‌ లిమిటెడ్‌ అనే ఆఫ్‌షోర్‌ కంపెనీలను స్టార్ట్ చేశారు.

5. గౌతమ్‌ సీంగల్‌

400 మిలియన్‌ డాలర్ల ప్రైవేటు ఈక్విటీ ఫండ్‌తో లింకప్‌ ఉన్నట్లు పత్రాల్లో తెలిసింది. అలాగే.. ఆయన పేరుతోనే మరో రెండు ఆఫ్‌షోర్‌ సంస్థలు కూడా రిజిస్టరై ఉన్నాయి. బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లో ఐమీడియా వెంచర్స్‌ లిమిటెడ్‌ను 2006లో ప్రారంభించారు. అది 2009 నవంబర్‌లో జెఫ్‌ మోర్గాన్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌గా పేరు మార్చుకుంది.

6. ప్రకాశ్‌ సంఖ్లా

మధ్యప్రదేశ్‌కు చెందిన రిటైర్డ్‌ ఉద్యోగి అయిన ప్రకాశ్‌ సంఖ్లాకు పనామాలో లోటస్‌ హారిజాన్‌ ఎస్‌ఏ అనే ఆర్గనైజేషన్ ఉంది. అందులో ఆయన కుమార్తెలు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారట.

7. వినోద్‌ రామ్‌చంద్ర జాదవ్‌

బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లో చాలా సంస్థలున్నాయి. పుణెలోని సవా హెల్త్‌కేర్‌ సంస్థకు వినోద్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. పలు ఆఫ్‌షోర్‌ కంపెనీల్లో షేర్‌ హోల్డర్‌గా, డైరెక్టర్ గా ఉన్నారు. వీటిల్లో 2010 నుంచి 2015 మధ్యలో స్థాపించినవే ఎక్కువగా ఉన్నట్లు పత్రాల్లో తేలింది.
8. అశోక్‌ మల్హోత్రా

బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లోని ఈ అండ్‌ పీ ఆన్‌లుకర్స్‌ లిమిటెడ్‌ సంస్థకు షేర్‌ హోల్డర్‌గానే కాకుండా డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. 2008 సెప్టెంబర్‌ 25న ఈ సంస్థను స్థాపించినట్లు పనామా పేపర్స్‌ పత్రాలు తెలియజేస్తున్నాయి.
9. రంజీవ్‌ దహుజా, కపిల్‌ సైన్‌ గోయల్‌

బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లో ఉన్న బీల్స్‌ ఇంటర్నేషనల్‌ కార్ప్‌ సంస్థకు డైరెక్టర్లుగా ఉన్నారు. 2012 జూన్‌లో ప్రారంభించిన ఈ కంపెనీలో వీళ్లు ఐదువేల షేర్లు కలిగి ఉన్నారు.

10. వివేక్‌ జైన్‌

బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లోని ‘సాక్వినవ్‌ గ్లోబల్‌ ఎస్‌ఏ’కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.అలాగే హాంకాంగ్‌లో ఉన్న రేడియంట్‌ వరల్డ్‌ హోల్డింగ్స్‌లో షేర్లు కలిగి ఉన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →