వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న పన్నీరు సెల్వం.. ?
తమిళ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. దినకరన్ కు పోలీసులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదే అదనుగా పన్నీరు సెల్వం పావులు కదుపుతున్నారని రాజకీయ వర్గాల సమాచారం. ఇక శశికళ వర్గం కూడా పన్నీరు సెల్వంతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. గ్రూపు రాజకీయాలకు ఇక ఆపాలని వారు పన్నీరు సెల్వంను కోరుతున్నారని సమాచారం. దీంతో పన్నీరు సెల్వం మూడు డిమాండ్లు వినిపిస్తున్నారని ప్రచారం సాగుతోంది. వీటిలో రెండు రాజకీయ పరమైనవి కాగా మరొకటి మాత్ర వ్యక్తిగతమైనదని తమిళ రాజకీయ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి.
వాస్తవానికి శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగడంపై పన్నీర్ సెల్వం ఎప్పటి నుంచో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీంతో శశికళను పార్టీ నుంచి జనరల్ సెక్రటరీగా తప్పించాలనే డిమాండ్ ను వినిపిస్తున్నారట. రెండవ డిమాండ్ గా దినకరన్ ను కూడా పార్టీ నుంచి సాగనంపాలని చెబుతున్నారట. మూడవ డిమాండ్ గా జయలలిత మరణంపై సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నారని సమాచారం. మూడవ డిమాండ్ తన రాజకీయ ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుందని ఆయన భావిస్తున్నారట. దీంతో ఈ మూడు డిమాండ్లపై పన్నీర్ గట్టిగా పట్టుబడుతున్నారని తమిళ రాజకీయ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.