తమిళనాట పన్నీరు అభిమానులు, మద్దతు దారుల ఆందోళనలు..
తమినాడు పోలీసులకు మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఓ లేఖ రాశారు. ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము శాంతియుత ప్రదర్శనకులకు పిలుపునిచ్చామని అందులో పేర్కొన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న జయ లలిత మద్దతుదారులను అరెస్టులు చేయవద్దని అందులో పేర్కొన్నారు. పళనీ స్వామి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని అన్నారు. ఈ ప్రభుత్వంలో అందరూ శశికళ మద్దతుదారులు మాత్రమే ఉన్నారని అన్నారు. అంతేతప్ప జయ లలిత అనుచరులు ఎవరూ లేరని పేర్కొన్నారు.
ఈ ప్రభుత్వంపై తాము ధర్మయుద్ధం చేస్తామని చెప్పారు. ఈ మేరకు ఆయన గురువారం రాత్రి జయ లలిత సమాధి దగ్గర శపధం చేసిన విషయం తెలిసిందే. శాసన సభలో బలపరీక్ష సందర్భంగా ఎమ్మెల్యేలు ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఓటు వేయాలని ఆయన కోరుతున్నారు. ఈ మేరకు వారిపై ఒత్తిడి తేవాలని ప్రజలకు సూచించారు. దీనికోసం ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలకు పిలుపునిచ్చారు. ఇక ఆయన పిలుపు మేరకు పన్నీరు అభిమానులు, మద్దతు దారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.