త్వరలో ప్రజల్లోకి వెళ్తా.. ప్రభుత్వాన్ని కూల్చేస్తా.. పన్నీరు సంచలన వ్యాఖ్యలు..
తమిళనాడు ముఖ్యమంత్రిగా పళనీ స్వామి ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా ఆయన బలనిరూపణ చేయాల్సి ఉంది. ఇదిలాఉండగా ఇక పన్నీరు సెల్వం తిరుగుబాటు బూడిదలో పోసిన పన్నీరు అయిపోయిందని అంతా అనుకున్నారు. అయితే పన్నీరు సెల్వం పళనీస్వామిపై ఘాటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన జయ లలిత సమాధి దగ్గరకు వెళ్లి నివాళులర్పించారు. అనంతరం అమ్మ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. ప్రస్తుతం అమ్మ ఆశయాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఏర్పాటు అవుతోందని అన్నారు.
ఈ ప్రభుత్వాన్ని కూల్చడమే తన టార్గెట్ అని బహిరంగంగా తేల్చి చెప్పారు. ఈ ప్రభుత్వానికి కేవలం ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని అన్నారు. అంతేతప్ప ప్రజల మద్దతు ఏ మాత్రం లేదని అన్నారు. కాని తనకు ప్రజల నుంచి మద్దతు ఉందని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వారెవరూ కూడా జయ లలిత అనుచరులు కాదని అన్నారు. అన్నాడీఎంకేను శశికళ వారసత్వ పార్టీగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఈ రకంగా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీలో ఉన్న నిజమైన కార్యకర్తలకు ద్రోహం చేస్తున్నారని అన్నారు. తాను త్వరలో ప్రజల్లోకి వెళ్తానని చెప్పారు. తమిళనాడు వ్యాప్తంగా పర్యటించి శశికళ ఉద్దేశ్యం , లక్ష్యాలు ప్రజలకు వివరిస్తానని చెప్పారు. జయ లలిత మరణానికి శశికళ కారణమని ఆరోపించారు. తాను జయ లలిత అన్నాడీఎంకే పార్టీని కాపాడుకుంటానని చెప్పారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.