Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Paris police fires on China resident..

By   /  March 28, 2017  /  Comments Off on Paris police fires on China resident..

    Print       Email

china-flag1చైనా వ్యక్తిని కాల్చి చంపిన పారిస్ పోలీసులు..

 

InCorpTaxAct
Suvidha

 

 

పారిస్ లో విషాదం చోటు చేసుకుంది. పక్కనున్న ఇంటివారితో తరచుగా గొడవపడుతున్న ఓ చైనీయుడిని స్థానిక పోలీసులు కాల్చి చంపారు. అదీ అతని ఇంటి ముందే కాల్చి చంపారు. దీంతో ఈ విషయాన్ని చైనా వాళ్లు సీరియస్ గా తీసుకున్నారు. తమ దేశానికి చెందిన వ్యక్తిని చంపండంపై మండిపడుతున్నారు.పలువురు చైనీయులు పారిస్ లో ఆందోళనలు చేస్తున్నారు. అక్క‌డి డిస్ట్రిక్ట్ పోలీసు హెడ్ క్వార్టర్స్ ఎదుట వారు హింసకు దిగారు.ఈ సందర్భంగా ఆందోళ‌న‌కారులు అక్క‌డి వాహనాలకు నిప్పు పెట్టారు.

ఈ ఘ‌ట‌న‌పై అక్క‌డి పోలీసులు మాట్లాడారు. కాల్పుల్లో మృతి చెందిన‌ చైనా వ్యక్తి కత్తెర్లతో దాడి చేశాడని చెప్పారు. అందుకే అతడిపై కాల్పులు జరపామ‌ని తెలిపారు. అయితే, పోలీసులు చెబుతున్న కార‌ణాల‌ను మృతుడి కుటుంబ సభ్యులు ఖండిస్తున్నారు. పోలీసులు అక్క‌డ‌కు రావడానికి ముందు ఆ వ్య‌క్తి కత్తెర్లతో చేపలు కోశాడని చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన‌ చైనా విదేశాంగ శాఖ తమ దేశ పౌరుడిని కాల్చిచంపిన ఘటనపై దర్యాప్తు జరపాలని ఫ్రాన్స్ రాయబారిని కోరారు. దీంతో కాల్పుల ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →