వాడీవేడిగా సాగిన పార్లమెంట్ సమావేశాలు..
పార్లమెంట్ సమావేశాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. మంగళవారం పార్లమెంట్ ఉభయ సభలను విపక్షాలు ఆందోళనలతో హోరెత్తించాయి. ముఖ్యంగా స్మృతీ ఇరానీ, కతేరియా అంశాలపై పార్లమెంటు ఉభయ సభలలో గందరగోళం చెలరేగింది. దీంతో సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. స్మృతీ ఇరానీపై లోక్సభలో కాంగ్రెస్.. రాజ్యసభలో బీఎస్పీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేశాయి. అటు రాజ్యసభలో కేంద్ర సహాయమంత్రి కతేరియా వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. ఇటీవల హత్యకు గురైన వీహెచ్పీ నేత సంస్మరణ సభలో పాల్గొన్న కతేరియా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో కతేరియా రాజీనామా చేయాలంటూ విపక్ష సభ్యులు పట్టుబట్టారు.
ఇదిలాఉండగా.. కేంద్రమంత్రి దత్తాత్రేయ కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియాపై సభలో మండిపడ్డారు. సింధియాపై దత్తన్న సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేశారు. మరోవైపు.. మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం తనయుడు కార్తీ అవినీతిపై విచారణ జరిపించాలని కోరుతూ అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేపట్టారు. ఆయన ఇంటిపై సీబీఐ, ఈడీ దాడులు జరిగాయన్నారు. తక్షణం కార్తిపై చర్యలు తీసుకోవాలంటూ పట్టుబట్టారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.