
బొమ్మను చేసి ప్రాణము పోసి – Parody Song on Corona-virus 🦠 : Awareness on Corona-virus
సాకీ :
కోవిడ్ బాధగా! వాట్సాప్ గాధగా!!
కన్నీటి ధారగా! కరోన కేసులు !!
తలవనిది జరిగినా ! చేసేది తోచక !!
పల్లవి:
కరోన సోకి ప్రాణం తీసి చూసేవు నీకిది వేడుకా!
కరోన సోకి ప్రాణం తీసి చూసేవు నీకిది వేడుకా !!
ట్రావెల్ చేసి వైరస్ తెచ్చి నవ్వేవు ఈ చైన చాలిక !
కరోన సోకి ప్రాణం తీసి చూసేవు నీకిది వేడుకా !
చరణం 1:
రోగాలు సృష్టించినావు కేర్లెస్సుగ నీవు, మరలా నీ చేతితో నీవె పంచావులే
ట్రావెల్ నీవల్ల ఆపేసినారు, గృహనిర్భంధం కర్ఫ్యూలు నీవల్లనే
అంతట కరోన! వ్యాక్సీన్ లేక! లాక్ డౌన్ నీవల్ల అయ్యిందిలే !!
అంతట కరోన! వ్యాక్సీన్ లేక! లాక్ డౌన్ నీవల్ల అయ్యిందిలే !!
కరోన సోకి ప్రాణం తీసి చూసేవు నీకిది వేడుకా ?
చరణం 2:
ఒకనాటి ఊహాన్ నగరం, నేడు హూనం, అదియే మరుభూమిగా నీవు మార్చావులే !
ఇటలీ దాటి, అమెరికా చేరి, వర్క్ ఫ్రం హోం తెచ్చావులే !
ఏ దేశమేగినా, ఏ నోట విన్న, ఈ వైరస్ చర్చలే జరిగేనులే !!
బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా !
Video URL: https://youtu.be/K1I4qU8l9xI
Original Song: https://www.youtube.com/watch?v=vpoIZj0U5t8
https://swaraala-pallaki.blogspot.com/2013/07/blog-post_4339.html
చిత్రం: దేవత (1965)
సంగీతం: కోదండపాణి
గీతరచయిత: వీటూరి
నేపధ్య గానం: ఘంటసాల
Parody Song:
Lyrics: Bala Reddy Indurti
Singer & Production: Srinivas Durgam
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.