Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Pathapatnam MLA Venkataramana to quit YCP, join TDP..?

By   /  March 1, 2016  /  Comments Off on Pathapatnam MLA Venkataramana to quit YCP, join TDP..?

    Print       Email

tdp ycp logos

నియోజక వర్గ అభివృద్ధి కోసమే టీడీపీలో చేరుతున్నా: ఎమ్మెల్యే కలమట వెంకట రమణ

InCorpTaxAct
Suvidha

 

వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇటీవలె నలుగురు ఎమ్మెల్యేలు ఓ ఎమ్మెల్సీ సైకిల్ ఎక్కిన విషయం తెలిసిందే. అయితే.. ఆ తర్వాత కూడా పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడబోతున్నారంటూ ముమ్మర ప్రచారం సాగింది. శ్రీకాకుళం, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు జంప్ కొడతారంటూ ప్రచారం సాగింది. అయితే ఎమ్మెల్యేలు చేజారిపోకుండా జగన్ విశ్వ ప్రయత్నాలు చేశారు. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించి.. క్లాస్ పీకినట్లు సమాచారం.

 

అయితే.. అధినేత చెప్పింది కేవలం పురాణంలా విన్నారని తెలుస్తోంది. ఎందుకంటే.. వైసీపీకి ఎమ్మెల్యే వెంకట రమణ షాక్ ఇచ్చారు. తాను టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా పాతపట్నం నియోజక వర్గ సమస్యలు, ప్రధాన సమస్యగా మారిన వంశధార నిర్వాసితులు సమస్యల పరిష్కారం కోసమే టీడీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఈ అంశంపై సోమవారమే ఆయన కార్యకర్తలతో సమావేశమై చర్చించినట్లు సమాచారం. అయితే మంగళవారం ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. వెంకట రమణ 4వ తేదీన టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. ఇదిలాఉండగా శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పచ్చ కండువా కప్పుకోబోతున్నారని ముమ్మర ప్రచారం సాగుతోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →