సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించనున్న పవన్..?
త్వరలో పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనుంది.గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఆ సినిమాలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో కూడా అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక త్రివిక్రమ్ తన సినిమాలో పవన్ ని సరికొత్తగా చూపించబోతున్నారని ఫిల్మ్ నగర్ లో ప్రచారం సాగుతోంది.
ఈ చిత్రంలో పవన్ ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించబోతున్నారని టాక్. ఇక ఈ చిత్రం కోసం ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ అందమైన సాఫ్ట్ వేర్ కంపెనీ సెట్ ను వేశారట. ఇప్పటివరకు పవన్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించలేదు. ఇక పవన్ ఈ పాత్రలో నటిస్తున్నారని ప్రచారం సాగడంపై ఆయన అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇక ఈ మూవీకి ‘దేవుడే దిగివచ్చినా’ అన్న టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా టాక్.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.