Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Pawan Kalyan appears differently…..

By   /  June 18, 2016  /  Comments Off on Pawan Kalyan appears differently…..

    Print       Email

pawanప‌వ‌న్ సినిమాకు ఆ టైటిలే ఫిక్సా?

 

InCorpTaxAct
Suvidha

 

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈసారి కొత్త‌గా క‌నిపించ‌నున్నారా? గ‌త సినిమాల‌తో పోలీస్తే ఈ సినిమా చాలా ఢిప‌రెంట్‌గా ఉంటుందా? ఈ సినిమా క‌థ రాయ‌సీమ చుట్టూ తిర‌గ‌నుందా? టైటిల్ కూడా సీమ‌కు సంబందించిందే ఉంటుందా? అంటే అవున‌నే అంటున్నారు ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు. ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు ఎస్ జే సూర్య. నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా పూర్తి కావచ్చింది. అయితే ఈసినిమా ప్రారంభం అయిన సమయంలో హుషారు అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాను చేస్తున్నట్టుగా తెలిపారు. అది ఫైనల్ టైటిల్ కాదని త్వరలోనే టైటిల్ వెల్లడిస్తామన్నారు. తాజాగా ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. చిత్ర నిర్మాత శరత్ మరార్ ఫిలిం ఛాంబర్ లో కడప కింగ్ అనే టైటిల్ ను రిజిస్టర్ చేశారు. అయితే ఇదే పవన్ సినిమా టైటిల్ అన్న టాక్ వినిపిస్తోంది. సినిమా ఓపెనింగ్ సమయంలో పవన్ ఫ్యాక్షనిస్ట్ లా తెల్ల బట్టల్లో కనిపించటం కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. నిజంగానే పవన్ సినిమా టైటిల్ కడప కింగా కాదా తెలియాలంటే మాత్రం అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →