Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Pawan Kalyan demands compensation for Mogalthur Aqua Food Park victims..

By   /  April 1, 2017  /  Comments Off on Pawan Kalyan demands compensation for Mogalthur Aqua Food Park victims..

    Print       Email

pkమొగల్తూరు బాధితు కుటుంబాలను ఆదుకోండి.. ప్రభుత్వాన్ని కోరిన పవన్ కల్యాణ్..

 

InCorpTaxAct
Suvidha

 

 

 

వెస్ట్ గోదావరిలోని మొగల్లూరులో ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ లో క్లీనింగ్ సందర్భంగా పాయిజన్ గ్యాస్ ను పీల్చి ఐదుగురు కార్మికులు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన సమాచారం తెలుసుకున్న సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇక బాధిత కుటుంబాలకు తక్షణం సహాయం అందజేయాలని జనసేనాని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఆయన ట్విట్టర్ లో స్పందించారు. బాధిత కుటుంబాలు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నాయని అన్నారు. తక్షణం ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించాలని కోరారు.

2012లో కూడా ఇదే ఫ్యాక్టరీలో సేమ్ ఇలాంటి ఘటనే చోటు చేసుకుందని పవన్ అన్నారు. అప్పట్లో బాధితులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని అన్నారు. తక్షణం గోదావరి జిల్లాలను కెమికల్స్ తో పొల్యూట్ చేస్తున్న ఫ్యాక్టరీలపై ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కొందరు పర్యావరణ వేత్తలు కూడా పవన్ కల్యాణ్ కలిసి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఫ్యాక్టరీలు నదీ జలాలను ఎలా కలుషితం చేస్తున్నాయో అంచనా వేస్తే వాటిని నిషేదించడానికి జనసేన టీమ్ పనిచేయాలని భావిస్తోందని అన్నారు. ఇక గోదావరి జిల్లాలను ప్రభుత్వం ఎలా రక్షిస్తుందో తెలియాల్సి ఉందని పవన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →