Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Pawan kalyan got a offer from bollywood director

By   /  August 11, 2016  /  Comments Off on Pawan kalyan got a offer from bollywood director

    Print       Email

pawan kalyan 2బాలీవుడ్ మూవీలో పవర్ స్టార్..?

 

InCorpTaxAct
Suvidha

 

 

ప్రస్తుతం పవర్ స్టార్ దృష్టి అంతా సినిమాల మీదే కేంద్రీకరించారు. మరో మూడు సినిమాలు చేసి రిటైర్ అవుతానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అందుకు భిన్నంగా ఆయన వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నారట. ఇప్పటికే పవన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. బాబీది, దాసరి నారాయణ రావు, త్రివిక్రమ్, వేదళం రీమేక్ లాంటి సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. అయితే రీసెంట్ గా పవన్ కు ఓ బాలీవుడ్ దర్శకుడు ఆఫర్ ఇచ్చాడు. ఓ సోషల్ మెసేజ్ కథ రాసుకుని పవన్ ను సంప్రదించారట.

సదరు దర్శకుడు సర్ధార్ గబ్బర్ సింగ్ లో పవన్ యాక్షన్ చూసి ఫిదా అయిపోయారట. దీంతో తన స్టోరీకి పవన్ అయితేనే కరెక్ట్ అని భావిస్తున్నారట. దీంతో కథను పవర్ స్టార్ కు వినిపించారట. ఇక కథ విన్న పవన్ కూడా తనకు నచ్చిందని చెప్పినట్లు సమాచారం. ఇది నిజమే అయితే.. త్వరలో పవన్ కల్యాణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే కాస్తంత వేచి ఉండాల్సిందే మరి..!

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →