Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Pawan kalyan has no time to question central govt on AP special status

By   /  August 1, 2016  /  Comments Off on Pawan kalyan has no time to question central govt on AP special status

    Print       Email

pawan kalyanప‌వ‌న్ ప్ర‌శ్నిస్తారా? లేదా?

 

InCorpTaxAct
Suvidha

 

 

ప్ర‌త్యేక హోదాపై అటు రాజ్య‌స‌భ‌లోను, ఇటు లోక్‌స‌భ‌లో పెద్ద దుమారం రేగుతుంటే ఆయ‌న మాత్రం ఏమీ ప‌ట్టించుకోరు. కేంద్రంలో భాగ‌స్వామి పార్టీ అయిన టీడీపీ కూడా కేంద్రం తీరును త‌ప్పుబ‌డుతుంటే ఆయ‌న మ‌త్రం నోరు మెద‌ప‌రు. ప్ర‌శ్నించ‌డానికే త‌న పార్టీ పుట్టింద‌ని చెప్పుకునే ఆ పెద్ద‌మ‌నిషికి ఇంకా ప్ర‌శ్నించే స‌మ‌యం ఆస‌న్నంకాలేద‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. అస‌లు ఆయ‌న ప్ర‌శ్నిస్తాడా?  లేదా? అన్న‌ది అంద‌రి ప్ర‌శ్న‌. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టమైన సంకేతాలివ్వడంతో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని రాజకీయ పక్షాలు ఆగ్గిమీద గుగ్గిలమైపోతుంటే జనసేన పార్టీ మాత్రం ఇంతవరకు దీనిపై స్పందించకపోవడం రాజకీయవర్గాల్లో పెద్ద దుమారం రేపుతోంది. ప్రజల తరపున ప్రశ్నించేందుకు తానున్నానని వచ్చిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాపై ఇంతవరకు స్పందించకపోవడంతో ఆయనకు మున్ముందు ఏపీలో ఇబ్బందులు తప్పవన్న సంకేతాలు రాజకీ యవర్గాల నుంచి వస్తున్నాయి.

రాష్ట్ర, జాతీయ ప్రయోజనాల కోసం టిడిపి, బిజెపి కూటమికి ఓటేయాలని గత సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కలియదిరిగారు. ఏపీలో మాత్రం టిడిపి, బిజెపి కూటమికే ప్రజలు పట్టంకట్టారు. ఆపై రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పలుమార్లు కేంద్ర, రాష్ట్రాల మధ్య అప్పుడప్పుడు వివాదాలు తలెత్తుతునేఉన్నాయి. ఈ నేపథ్యంలో గత కొద్ది నెలల కిందట రాష్ట్రంలోని వివిధ పార్టీల విమర్శల నేపథ్యంలో రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో రైతుల భూముల సేకరణకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన పవన్ కళ్యాణ్ మళ్లీ జనం ముందుకు రాలేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి, బిజెపి కూటమికి స్టార్ క్యాంపెయినర్‌గా పనిచేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రత్యేక హోదాపై చెలరేగుతున్న వివాదంపై స్పందించకపోవడం రాజకీయంగా దుమారం రేపుతోంది.

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టంచేయడంతో విజయవాడలో ఏపీ కాంగ్రెస్ పార్టీ విద్రోహ దినం నిర్వహిస్తోంది. కేంద్ర వైఖరికి నిరసనగా ఆగస్టు రెండో తేదీన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. ఇలా ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఏపీ రాష్ట్రం అగ్నిగుండంగా మండుతుంటే ఏపీ ప్రజల తరపున కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదీ అని అన్ని రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో జనసేన పార్టీ అభిమానులు నిరాశకు గురవుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి, బిజెపి కూటమికి అనుకూలంగా ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని నిలదీయాలని డిమాండ్ చేస్తున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →