Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

జ‌నసేన‌కు రాజ‌కీయ పార్టీగా గుర్తింపు

By   /  April 27, 2016  /  Comments Off on జ‌నసేన‌కు రాజ‌కీయ పార్టీగా గుర్తింపు

    Print       Email

pawan kalyanప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ స్థాపించిన జ‌న‌సేన పార్టీని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ రాజ‌కీయ పార్టీగా గుర్తించిన‌ట్లు ఎన్నిక‌ల సంఘం పేర్కొంది.జనసేనకు రాజకీయ పార్టీ హోదాకు సంబంధించిన పత్రాల్ని పవన్ కల్యాణ్ తో పాటు.. ఏపీలోని అన్ని జిల్లా కలెక్టర్లకు పత్రాలు అందాయి. పొలిటికల్ పార్టీగా జనసేనను గుర్తించిన ఎన్నికల సంఘం.. ఆ పార్టీకి గుర్తును మాత్రం కేటాయించలేదు. కాకుంటే.. స్వతంత్రంగా పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థుల కంటే జనసేనకు ప్రాధాన్యత ఇస్తారు. అంటే.. ఎన్నికల సంఘం సూచించిన గుర్తుల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకునే వెసులుబాటు కలుగనుంది. ఈసీ గుర్తింపు నేపథ్యంలో జనసేన రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీ హోదా దక్కినట్లే.

అయితే 2019 ఎన్నిక‌ల్లో క్రియాశీల రాజకీయాల్ని చేస్తానంటూ పవర్ స్టార్ పవన్ పేర్కొనటం తెలిసిందే. అయితే.. ఎవరైనా ఒక పార్టీ పెట్టాలని అనుకున్నా.. పార్టీ పెట్టినా నిబంధనల ప్రకారం అనుసరించాల్సిన పద్ధతులు చాలానే ఉంటాయి. రాజకీయ పార్టీకి ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వటం.. వాటికి గుర్తింపు లభించటం లాంటి ప్రొసీజర్స్ ఉన్నాయి. 2014 ఎన్నికలకు కొద్దిరోజుల ముందు జనసేన పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్.. పార్టీకి సంబంధించిన గుర్తింపునకు అవసరమైన పత్రాల్ని ఎన్నికల సంఘంలో దాఖలు చేశారు. కాగా ఇప్ప‌టి నుంచి అయినా జ‌న‌సేన అధినేత జ‌నాల్లోకి వ‌స్తూ, ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ ప్ర‌జ‌ల త‌ర‌ఫున పోరాడుతారేమో చూడాలి.

InCorpTaxAct
Suvidha
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →