Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Pawan Kalyan meets Harvard doctor on Uddanam issue..

By   /  July 31, 2017  /  Comments Off on Pawan Kalyan meets Harvard doctor on Uddanam issue..

    Print       Email

విశాఖలో హర్వర్డ్ నిపుణులతో భేటీ అయిన పవన్..

 

InCorpTaxAct
Suvidha

 

 

 

ఉద్దానంలో కిడ్నీ వ్యాధులను అరికట్టేందుకు పూర్తిస్థాయిలో పరిష్కారం చూపించినప్పుడే తాను చేసే ప్రయత్నాలు ఫలించినట్లు అని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. అక్కడి కిడ్నీ సమస్యలపై డాక్టర్లు, హర్వార్డ్ వర్సిటీ ప్రొఫెసర్లు అధ్యయనం చేశారు. వారితో పవన్ విశాఖలో సమావేశం అయ్యారు. తాను చేసే ఈ పని రాజకీయ లబ్ధి కోసం మాత్రం కాదని అన్నారు. ప్రజల కోసమే తాను ఈ కార్యక్రమం చేపట్టానని అన్నారు.

ఎంత పెద్ద పని అయినా చిన్న ప్రయత్నంతోనే ప్రారంభమవుదుందని అన్నారు. తనతో పాటు వచ్చిన వారందరికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. సమస్య పరిష్కారం కావడం కోసం అవసరం అయితే వైసీపీ మద్దతు కూడా తీసుకుంటానని అన్నారు. ప్రజల కోసం పనిచేసేవారు ఎవరు వచ్చినా తాను వారితో కలిసి పనిచేస్తానని చెప్పారు. సోమవారం కిడ్నీ బాధితుల అంశంపై చర్చించేందుకు పవన్ .. ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. వీరి భేటీలో ఉద్దానం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Shailesh Lakhtakia’s Journey

Read More →