సూర్యాను డైరెక్ట్ చేయోద్దన్న పవన్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బాగా ఇష్టపడే డైరెక్టర్ ఎస్.జె.సూర్యాను ఎందుకు వద్దన్నాడు? ఆ ప్లేసులో మరొకరిని ఎందుకు ఎంచుకున్నాడు? ఇద్దరి మధ్య ఏవైనా గొడవలు ఏమైనా జరిగాయే? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అసలు ఎందుకలా జరిగింది? అనే విషయాలపై వివరాల్లోకి వెళ్లితే…
నిజానికి ఆకుల శివ రాసిన ఒక కతను.. ఎస్.జె.సూర్య డైరక్షన్ లో.. శరత్ మరార్ ప్రొడక్షన్ లో.. ”కడప కింగ్” (టెంటేటివ్ టైటిల్) అంటూ తెరమీదకు తీసుకురావల్సి ఉంది. అయితే ఈ మధ్యన ఎస్.జె.సూర్య ఒక క్యారెక్టర్ లో నటించిన ”ఇరైవి” సినిమా విడుదలైంది. ఈ సినిమాలో మనోడి నటన ఒక రేంజులో వర్కవుట్ కావడంతో.. వెంటనే తమిళంలో పెద్ద పెద్ద హీరోల సరసన యాక్టింగ్ ఛాన్సులు వచ్చేశాయి. ఇక తెలుగులో మహేష్ బాబు సరసన ఏ.ఆర్.మురుగుదాస్ సినిమాలో విలన్ గా కూడా నటిస్తున్నాడు కుర్రాడు. దానితో డైరక్షన్ చేయడానికి మనోడికి తీరిక దొరకదేమో అనే సందేహం వెల్లిబూర్చడంతో..స్వయంగా పవన్ ఇతన్ని తప్పించి.. ఆ ప్లేసులో మరొక డైరక్టర్ ను పెట్టాడు. ”గోపాల గోపాల” సినిమా చేసేటప్పుడు.. మనం ఒక ప్రాజెక్టు చేద్దాం అంటూ దర్శకుడు కిషోర్ పార్దసాని (డాలి) కి పవన్ మాటిచ్చాడు. ఆ మాట నిలబెట్టుకుంటూ ఇప్పుడు ఈ సినిమాను అతని చేతుల్లో పెట్టాడు. అది సంగతి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.