Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Pawan Kalyan should tie up with Left parties, says CPI Rama Krishna

By   /  February 28, 2018  /  Comments Off on Pawan Kalyan should tie up with Left parties, says CPI Rama Krishna

    Print       Email

పవన్ వామపక్ష పార్టీలతో కలవాలి: సీపీఐ రామకృష్ణ

 

InCorpTaxAct
Suvidha

 

 

ఏపీ సీపీఐ నేత రామకృష్ణ పవన్ రాజకీయాలపై మాట్లాడారు. రాజకీయ ప్రక్షాళన జరగాలంటే పవన్ వామపక్ష పార్టీలతో కలవాలని సూచించారు. ఏపీ ప్రత్యేకహోదా, రైల్వేజోన్ సాధనకు కోసం విశాఖలో వామపక్షాల ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది. ఈ మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రామకృష్ణ మాట్లాడుతూ…. ప్రత్యేకహోదా కోసం సీఎం చంద్రబాబు చిత్తశుద్ధితో పనిచేయాలని, అఖిలపక్షం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అన్నారు.

చంద్రబాబు చెబుతున్న అభివృద్ధి టీడీపీ నేతలకు మాత్రమే పరిమితమైందని, విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సుపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మార్చి 5న ఢిల్లీ వెళ్లి ఏపీకి ప్రత్యేకహోదాపై తేల్చుకుంటామని అన్నారు. అలాగే మహాధర్నాలో పాల్గొన్న సీపీఎం నేత రాఘవులు కూడా స్పందించారు. ఏపీ ప్రత్యేక హోదా, రైల్వేజోన్, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →