Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

ప‌వ‌న్‌కు షాక్ ఇచ్చిన శృతి

By   /  July 14, 2016  /  Comments Off on ప‌వ‌న్‌కు షాక్ ఇచ్చిన శృతి

    Print       Email

Sruthi Hassan Photos _10__001

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌టి వ‌ర‌కు రేణ‌దేశాయ్ తో మిన‌హా రెండుసారి ఏ హీరోయిన్‌తో న‌టించ‌లేదు. రేణుతో కూడా అప్పటికే వ్యక్తిగత అనుబంధం ఉండబట్టే ఆమెతో రెండో సినిమా చేశాడు. అది కూడా స్వీయ దర్శకత్వంలో చేసిన సినిమా కాబట్టి.. తనకు అన్ని రకాలుగా అనువుగా ఉంటుందని రేణును హీరోయిన్ గా పెట్టుకున్నాడు. పవన్ ఇన్నాళ్లూ ఉద్దేశపూర్వకంగానే ఇలా ఒకసారి పని చేసిన హీరోయిన్ తో ఇంకోసారి పని చేయకూడదని రూల్ ఏమైనా పెట్టుకున్నాడో లేదో కానీ.. ఈ అరుదైన రికార్డు ఇలా కొన‌సాగేట‌ట్లు క‌నిపిస్తోంది.  గబ్బర్ సింగ్‌లో తన సరసన నటించిన శ్రుతి హాసన్ ను తన కొత్త సినిమాకు ఫైనలైజ్ చేశాడు పవన్. ఇది నెలన్నర కిందటి మాట. ఐతే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. నెల కిందటే మొదలవ్వాల్సిన సినిమా.. ఇప్పటిదాకా పట్టాలెక్కలేదు.

InCorpTaxAct
Suvidha

ఎస్.జె.సూర్య ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. డాలీ లైన్లోకి వచ్చాడు. శ్రుతి ఇంతకుముందు అనుకున్న ప్రకారం ఈ సినిమాకు డేట్లు సర్దుబాటు చేసే పరిస్థితి లేదు. ఆమెకు వేరే కమిట్మెంట్లు ఉన్నాయి. పవన్ సినిమా ఎప్పుడు మొదలై.. ఎప్పుడు ముగుస్తుందో క్లారిటీ లేదు. దీంతో ఈ సినిమాకు ఆమె గుడ్ బై చెప్పేసినట్లు సమాచారం. కాబట్టి పవన్ మరో హీరోయిన్ని వెతుక్కోక తప్పదు. మరి ఆల్రెడీ పని చేసిన ఇంకో హీరోయిన్ని చూసుకుంటాడా.. లేక కొత్త హీరోయిన్ని ట్రై చేస్తాడా? అన్న‌ది వేచి చూడాలి మ‌రి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →