Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Pawan Kalyan slams govt. on Agrigold issue..

By   /  March 30, 2017  /  Comments Off on Pawan Kalyan slams govt. on Agrigold issue..

    Print       Email

pawanఅగ్రీగోల్డ్ అంశంలో ప్రభుత్వ వైఫల్యం.. జనసేనాని విమర్శలు..

 

InCorpTaxAct
Suvidha

 

 

అగ్రీ గోల్డ్ సమస్యను ప్రభుత్వమే పెద్దది చేసిందని జనసేనాని పవన్ కల్యాణ్ ఆరోపించారు. గోటితో పోయే సమస్యను గొడ్డలిదాకా తెచ్చారని విమర్శించారు. ఈ మేరకు ఆయన అగ్రీగోల్డ్ బాధితులను కలిసిన అనంతరం వ్యాఖ్యానించారు. మొదటిసారి అగ్రీగోల్డ్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయినప్పుడే ప్రభుత్వం కలుగజేసుకుని ఉంటే ఈ రోజున ఆత్మహత్యలు జరిగి ఉండేవి కావన్నారు. దీనివెనక ప్రభుత్వం వైఫల్యం ఉందని అన్నారు. గత రెండేళ్ళుగా ఈ సమస్య గురించి తాను ఆలోచిస్తూనే ఉన్నానని అన్నారు. బాధితులకు అప్పుడు వాటి వడ్డీలు ఎలా పెరిగి ఉంటాయో అర్ధం చేసుకోవగలనని అన్నారు.

ఇక రాజకీయ నాయకులు బాధితులను అణగదొక్కాలని చూడటం తనకు బాధ కలిగించిందని అన్నారు. ఆదిలోనే పరిష్కరించే సమస్యలను క్లిష్టతరం చేశారని ఆరోపించారు. బాధితుల పరిస్థితికి అన్ని ప్రభుత్వాలు కారణమేనని అన్నారు. ఈ కంపెనీకి చెందిన పెట్టుబడులు అన్నీపేదల నుంచి సేకరించినవేనని అన్నారు. అయితే పిల్లల భవిష్యత్తు కోసమని ఆశపడి పెట్టుబడులు పెట్టారని అన్నారు. ప్రస్తుతం చట్టం బలహీనులపై ఎక్కువగా పనిచేస్తోందని ఆరోపించారు. కేవలం ఏపీలోని అగ్రీగోల్డ్ సంస్థకు వేల ఎకరాలు ఉన్నాయని అన్నారు. అందులోంచి కొన్ని ఎకరాలు హాయ్ ల్యాండ్ లో కూడా ఉన్నాయని అన్నారు. ఈ ఆస్తుల వేలాన్ని ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. దీనివెనుక స్వలాభం చూసుకోరాదని అన్నారు. ఒకవేళ అదే జరిగితే చాలా పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయని అన్నారు.అగ్రీగోల్డ్ విషయంలో ఆర్ధిక నిపుణుల సలహాలతో నిర్ణయం తీసుకోవాలని అన్నారు. సహారాలో సుబ్రతోరాయ్ ని బిగించినట్లుగా వీరిని కూడా బిగించాలని అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →