దిల్ రాజు భార్య అనిత మృతిపట్ల సంతాపం ప్రకటించిన పవన్ కల్యాణ్..
టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు భార్య అనిత మృతిపై తారా లోకం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆమె మృతిపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రెజెంట్ ఆయన తన చిత్రం కాటమరాయుడు షూటింగ్ లో ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. దీంతో ఆయన ఓ పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు. దిల్ భార్య అనిత మృతి వార్త నిజం కాకూడదని తాను భావించానని అన్నారు.
తనకు సినీ పరిశ్రమలో ఉన్న కొందరు ఆత్మీయులు ఉన్నారని అన్నారు. వారిలో దిల్ రాజు కూడా ఒకరని అన్నారు. అలాంటి వ్యక్తికి వచ్చిన కష్టం తనను బాగా కలచివేసిందన్నారు. దిల్ నిర్మించే చాలా సినిమాలకు ఆయన భార్య అనిత సమర్పకురాలిగా ఉన్నారని అన్నారు. అలా అనితకు సినీ పరిశ్రమతో అనుబంధం ఉందన్నారు. దిల్ రాజు కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు. అలాగే అనిత ఆత్మకు శాంతి చేకూరాలని ప్రకటనలో తెలిపారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.