ప్రత్యేక హోదాపై పవన్ ఏం చేయబోతున్నారు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదనేది మరోసారి స్పష్టమైంది. మొన్న కేంద్ర మంత్రి ఒకరు ఏపీ ప్రత్యేక ఇచ్చే ప్రసక్తేలేదని చెప్పడం ఒక్క ఎత్తైతే నిన్న చంద్రబాబు మోడీని కలిసిన తర్వాత కూడా మోడీ ప్రత్యేక హోదా ఇస్తామని ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నోరు విప్పాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే బీజేపీపై పవన్‌కల్యాణ్ కూడా ఆగ్రహంతోనే ఉన్నారని ఆయన సన్నిహితులు కొంతమంది చెబుతున్నారు. తాను స్వయంగా బయటకు వచ్చి.. తన ఇమేజ్ ను పణంగా పెట్టి.. ఏపీకి అన్నివిధాలుగా మోడీ సాయం చేస్తారని చెప్పిన తర్వాత.. ఈ రోజు మోడీ పరివారం అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకోవటంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. మోడీ సర్కారు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పటం అంటే.. తాను చెప్పిన మాట అబద్ధమైందన్నట్లుగా పవన్ ఆందోళన చెందటమే కాదు.. ఇది తన విశ్వసనీయతను దెబ్బ తీసే పరిణామంగా ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలన్న అంశంపై పవన్ అండ్ కో తీవ్రస్థాయిలో సమాచాలోచనలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. మోడీ మీద వార్ ప్రకటించినా.. అది తొందరపాటు అవుతుందని.. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల వ్యవధి ఉండటం.. కేంద్రంలో బలంగా ఉన్న మోడీని వ్యతిరేకించటం వల్ల ఏపీకి కలిగే ప్రయోజనం ఏమీ ఉండదన్న భావనలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. సమస్య ఎక్కడ ఉంటే తాను అక్కడ ఉంటానన్న పవన్ కల్యాణ్ ఇదివరకే చెప్పారు. కాబట్టి రాష్ట్రానికి సంబంధించి ఇంత పెద్ద సమస్యపై పవన్ నోరు విప్పకపోతే మాత్రం ఆయన తీవ్ర నష్టం తప్పదనేది వాస్తవం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.