Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Payyavula Kesav fires on Chandra Babu Naidu

By   /  August 8, 2016  /  Comments Off on Payyavula Kesav fires on Chandra Babu Naidu

    Print       Email

Payyavula kesavబాబుపై ప‌య్యావుల ఫైర్‌

 

InCorpTaxAct
Suvidha

 

 

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సొంత పార్టీ నేత‌ల నుంచే విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. ఇటీవ‌ల విమ‌ర్శ‌ల దాడి కొంచెం ఎక్కువైంది కూడా. తాజాగా టీడీపీ సీనియ‌ర్ నేత  ఎమ్మెల్సీ ప‌య్యావుల కేశవ్ బాబుపై ప‌రోక్షంగా ఫైర‌య్యార‌ట‌. ద‌శాబ్దాలుగా టీడీపీకి సేవ చేస్తున్నా, ప‌దేళ్ల‌పాటు ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు నానా తిప్ప‌లు ప‌డి అధికారంలోకి తీసుకువ‌చ్చినా త‌మ‌కు ఎలాంటి గుర్తింపూ లేద‌ని ఆయ‌న వాపోతున్న‌ట్టు తెలిసింది. కాగా  సీఎం చంద్ర‌బాబు ఇటీవ‌ల తిరుపతి  కార్పోరేషన్ బాధ్యతలను కేశవ్‌కు అప్ప‌గించారు. దీంతో కేశ‌వ్ త‌ర‌చుగా తిరుప‌తికి వ‌స్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఒకింత అస‌హ‌నానికి గుర‌య్యారు. ఇలాంటి చిన్నా చిత‌కా ప‌నులు మేం చేయాల‌ని బుగ్గ‌కారులో తిరిగేందుకు మాత్రం ఇప్పుడొచ్చిన వారికి అవ‌కాశం ఇస్తారు అంటూ ఆయ‌న త‌న ఆవేద‌న‌ను వెళ్ల‌గ‌క్కార‌ట‌. పార్టీ పదేళ్లు కష్టకాలంలో ఉన్నప్పుడు గట్టిగా నిలబడ్డామని, తీరా అధికారంలోకి వస్తే అనుభవించేందుకు ఇతరులు తయారయ్యారని , ఏం చేద్దాం..మన తలరాతే అట్లా ఉందంటూ వ్యాఖ్యానించినట్లు స‌మాచారం. మ‌రోప‌క్క‌, త్వ‌ర‌లోనే కేబినెట్ విస్త‌ర‌ణ ఉంటుంద‌ని ఇటీవ‌ల చంద్ర‌బాబు ప్ర‌క‌టించ‌డంతో ప‌య్యావుల ఆశ‌లు పెట్టుకున్నారు.

అయితే, ఇప్ప‌ట్లో ఉండ‌బోద‌ని తెలియ‌డం, ఆ సీటుకు కూడా రిజ‌ర్వేష‌న్ అయిపోవ‌డం వంటి విష‌యాలు తెలియ‌డంతో ఆయ‌న మ‌రింత నిరుత్సాహానికి గురై ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే, కేశవ్ తో పాటు సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి, ధూళిపాళ్ల నరేంద్ర కూడా మంత్రి ప‌ద‌వుల‌ను ఆశిస్తున్న వారి జాబితాలో ఉన్నారు. మ‌రి చంద్ర‌బాబు ఎవ‌రిని క‌రుణిస్తారో? ఎవ‌రికి హ్యాండిస్తారో చూడాలి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →