Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

payyavula kesav will he be given minister opportunity?

By   /  August 29, 2016  /  Comments Off on payyavula kesav will he be given minister opportunity?

    Print       Email

Payyavula kesavబాబు క్యాబినెట్‌లోకి ప‌య్యావుల‌?

 

InCorpTaxAct
Suvidha

 

 

అనంత‌పురం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు ప‌య్యావుల కేశ‌వ్‌ను మంత్రి వ‌ర్గంలోకి తీసుకుంటున్నారా?  బాబు ఆ కోణంలో ఆలోచిస్తున్నారా? ప‌య్యావుల‌ క్యాబినెట్‌లోకి వ‌స్తే ఎవ‌రిపై వేటు ప‌డ‌నుంది? ప‌రిటాల సునీత ప‌రిస్థితి ఏంటి? అన్న‌ది ప్ర‌స్తుతం హాట్ టాఫిక్‌గా మారింది. ఎన్నో ఏళ్లుగా టీడీపీని అంటిపెట్టుకుని ఉన్న ప‌య్యావుల కేశ‌వ్‌ను ఈసారి ఎలాగైనా మంత్రి వ‌ర్గంలోకి తీసుకోవాల‌ని కొంత‌మంది టీడీపీ నేత‌లు బాబుపై ఒత్తిడి చేస్తున్నార‌ట‌. ప‌య్యావుల క్యాబినెట్‌లో ఉంటే ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌కు గ‌ట్టిగా బుద్ధి చెబుతార‌ని, రాయ‌ల‌సీమ‌కు చెందిన అంశాల‌పై కేశ‌వ్‌కు మంచి ప‌ట్టుఉంద‌ని వారంటున్నార‌ట‌. ఇదిలా ఉంటే చాలా రోజులుగా ప‌య్యావుల త‌న‌కు త‌గిన గుర్తింపు ఇవ్వ‌డం లేద‌ని టీడీపీపై అసంతృప్తిగా ఉన్నార‌ని, ఆయ‌న‌ను మంత్రి వ‌ర్గంలోకి తీసుకుంటే ఇలాంటివి ఉండ‌కుండాపోతాయ‌ని వారంటున్న‌ట్లు స‌మాచారం. అయితే, ఇప్ప‌టికే అనంత‌పురం నుంచి ప‌రిటాల సునీత‌, ప‌ల్లె ర‌ఘునాథ్‌లు మంత్రి వ‌ర్గంలో ఉన్నారు. దీంతో ఇప్ప‌డు ప‌య్యావుల‌ను కూడా తీసుకుంటే ఒకే జిల్లాలో ముగ్గురు మంత్రులు అవుతార‌ని, బాబు మ‌రో ఆలోచ‌న చేస్తున్న‌ట్లు స‌మాచారం.

ప‌ల్లె, లేదా ప‌రిటాల‌ను ఒక‌రిని మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించి ప‌య్యావుల‌కు ఛాన్స్ ఇవ్వాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారట‌. మ‌రి ఇందులోనూ ఓ చిక్కుంద‌ని చెబుతున్నారు తెలుగు త‌మ్ముళ్లు! అదేంటంటే ప‌రిటాల సునీతకు స్థానికంగా ప‌య్యావుల క‌న్నా మంచి ప‌లుకుబ‌డి ఉంద‌ట‌. మ‌రి ప‌ల్లె విష‌యానికి వ‌చ్చినా.. ఆయ‌న కూడా టీడీపీలో ఎన్నో ఏళ్లుగా ఉన్నారు. అదేస‌మ‌యంలో ప‌రిటాల‌కు ఇటీవ‌ల మంత్రి ప‌రంగా బాబు చేయించిన స‌ర్వేలో ఓ మాదిరి మార్కులే వ‌చ్చాయ‌ట‌. అలాగే పల్లెను త‌ప్పించాలంటే సునీత‌, కేశ‌వ్ ఇద్ద‌రూ ఒకే సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారు  అవుతున్నార‌ని,  దీంతో ప‌ల్లెను కొన‌సాగించి.. ప‌రిటాల స్థానంలో ప‌య్యావుల‌ను తీసుకుంటే ఎలా ఉంటుంది? అనే విషయంపై బాబు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్న‌ట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం. మ‌రి ప‌రిటాల‌ను త‌ప్పితే ఆమె ఊరుకుంటుందా అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. చూడాలి మ‌రి బాబు ఏం చేయ‌బోతున్నారో.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →