Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

People are becoming poorer and Politicians are becoming richer

By   /  August 16, 2016  /  Comments Off on People are becoming poorer and Politicians are becoming richer

    Print       Email

politicsప్ర‌జ‌ల‌కు ప‌స్తులు.. ఎమ్మెల్యేల‌కు ఆస్థులు!

 

InCorpTaxAct
Suvidha

 

 

ప్ర‌జా సేవ చేయాల్సిన ప్ర‌జా ప్ర‌తినిధులు  ప్ర‌తి దానిలో త‌మ‌కెంత లాభం వ‌స్తుంద‌ని చూస్తున్నారు. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తామ‌నే విష‌యంపై చ‌ర్చించ‌కుండా అందిన కాడికి దోచుకుంటున్నారు. ఓపక్క పీకల్లోతు ఆర్థిక కష్టాలతో ఏపీ రాష్ట్రం కిందామీదా పడిన వేళ.. ఖర్చు విషయంలో కట్టడి పాటించాలని అంతా సలహాలు ఇస్తున్నవేళ.. వీలైనంత వరకూ ప్రభుత్వం మీద భారం పడకుండా చూడాల్సిన బాధ్యత  ప్రజాప్రతినిధులుగా రాజకీయ నేతల మీద ఉంటుంది. దీనికి భిన్నంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి.. భారం లాంటి వాటిని పట్టించుకోకుండా తమ సుఖం.. సౌకర్యమే ముఖ్యమన్నట్లుగా వ్యవహరిస్తున్న ఏపీ ఎమ్మెల్యేల తీరు చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. రాజధాని సీడ్ కేపిటల్ లో చక్కటి విల్లాల సముదాయాన్ని నిర్మించి.. వాటిని ఎమ్మెల్యేలకు ఇవ్వాలన్న ప్రతిపాదన చేస్తున్న ఎమ్మెల్యేలు ఎంచక్కా దీనికో బ్రహ్మండమైన లాజిక్ కూడా చెప్పుకురావటం విశేషం.

ప్రతి నగరానికి ఒక ఆకర్షణీయమైన ప్రాంతం ఉంటుందని.. అలానే అమరావతిలోనూ అలాంటి ప్రాంతం ఒకటి ఉండాలని.. ఆ ఒక్కటిలో ఎమ్మెల్యేల విల్లాలు అయితే మరింత బాగుంటుందని.. ఆ పని కానీ చేస్తే ఆ ప్రాంతమంతా ఒక ఆకర్షణీయమైన ప్రదేశంగా మారుతుందని ప్రభుత్వ పెద్దలకు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఈ నివాస సముదాయానికి 150ఎకరాల్లో నిర్మించాలని..విల్లాల నిర్మాణం పూర్తి అయిన పక్షంలో రాజధాని అమరావతికి సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అవుతుందని.. టూరిస్టులతోపాటు.. పెట్టబడి దారుల్ని కూడా విశేషంగా ఆకర్షించే వీలుందని చెబుతున్నారు. మరి.. ఎమ్మెల్యేల ప్రతిపాదన విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →