Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

People who believe in Chandra babu Naidu gave their Lands for development… Chandra Babu naiad will keep his promise

By   /  June 26, 2016  /  Comments Off on People who believe in Chandra babu Naidu gave their Lands for development… Chandra Babu naiad will keep his promise

    Print       Email

chandrababuమీ న‌మ్మ‌కాన్నివ‌మ్ముచేయ‌ను

 

InCorpTaxAct
Suvidha

 

 

త‌న‌ను న‌మ్మి రాజ‌ధాని నిర్మాణానికి ప్ర‌జ‌లు భూములు ఇచ్చార‌ని, వాళ్ల  న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌న‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు  అంటున్నారు. రైతుల‌కు ఇచ్చిన మాట ప్ర‌కారం వాళ్లు అన్నీ చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. భూములు ఇచ్చిన రైతుల‌కు స్థ‌లాల కేటాయింపు కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సీఎం బాబు ఉద్వేగంగా మాట్లాడారు.  ఇది చ‌రిత్ర‌లో నిలిచిపోయే రోజ‌ని.. ఈ రోజు తాను ఎప్ప‌టికీ మ‌రిచిపోలేన‌న్నారు. నేలపాడు వాసులకు ప్లాట్లు పంపిణీ చేయడం మొట్టమొదటి ఘట్టమని పేర్కొన్నారు. నేలపాడు వాసి కొమ్మినేని ఆదిలక్ష్మికి తొలి ప్లాటును అందజేశారు. రాజధాని ఇక్కడ వస్తుందని ఎవరూ ఊహించలేదని, కల కూడా కనలేదని ఆయన అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్ర విభజనతో పాటు 13 జిల్లాల్లోనూ విభజన సృష్టించాలని కాంగ్రెస్ పార్టీ కమిటీ వేసిందని ఆయన విమర్శించారు. అందరికీ సమాన దూరంలో ఉండేలా ఆలోచించి రాజధాని నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. తనపై నమ్మకంతో రైతులు ముందుకు వచ్చి 33 వేల ఎకరాలు ఇచ్చారని సిఎం గుర్తు చేశారు.

‘అమరావతి నిర్మాణం జరగకుండా చేయాలని ప్రతిక్షం అడుగడుగునా అడ్డుపడింది, ఎంత రెచ్చగొట్టినా మన రైతులు వారి మాటలు నమ్మలేదు’ అని ఆయన అన్నారు. జైరాం రమేష్ తన పుస్తకంలో రాసుకున్న విధంగా కాంగ్రెస్ తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విభజించిందని ఆయన ఆరోపించారు. అలా చేయడం వల్ల ఎంత నష్ట పోయామో కాంగ్రెస్‌వారు ఇప్పుడు తెలుసుకుంటున్నారని సిఎం అన్నారు. రాష్ట్రానికి రాజధానిని నిర్మించే బాధ్యత ప్రజలు నమ్మకంతో తనపై ఉంచడం ఎంతో అదృష్టమని చంద్రబాబు అన్నారు. దేశంలోనే అమరావతిని ప్రప్రథమ స్థానంలో నిలపెడతానని, ప్రజల ఆశలు నెరవేరుస్తానని  సీఎం స్ప‌ష్టం చేశారు. కాగా మొత్తం 847 మంది రైతులకు లాటరీ పద్ధతిలో 1,916 స్థలాలను ఇచ్చారు. ఇందులో 1,167 నివాసిత ప్లాట్లు, 796 వాణిజ్య ప్లాట్లు ఉన్నాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →