Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

స్పిరిచ్యువల్ స్టో రీ..ఆధ్యాత్మిక కథ..0002.”చదువు రాని వాడనని ”

By   /  July 3, 2016  /  No Comments

    Print       Email

Hyderabad-Local-Busహైదరాబాద్ లో ఓ సిటీ బస్ లో..ఓ పెద్దాయన జేబులోంచి సెల్ ఫోన్ కొట్టేయాలని చూస్తున్నాడు ఓ టిప్ టాప్ కుర్రాడు.బస్సు పెద్ద రష్ గా ఏం లేదు. పెద్దాయన కొంచెం ధ్యానంలో ఉన్నాడేమో..సన్నగా కళ్ళు మూసుకున్నాడు.ఎవరో తోసినట్టుగా(కావాలనే) ఆ కుర్రాడు పెద్దాయన ఒళ్లో పడ్డాడు.

 

InCorpTaxAct
Suvidha
” సారీ సర్..” అనేసి సర్దుకు నిలబడ్డాడు కుర్రాడు.పొట్టిగా నల్లగా అదోలా నవ్వుతూ ఉన్న
వాడి వాలకం చూసిన పెద్దాయన..
చిరునవ్వు నవ్వుతూ ” బస్సుల్లో రైళ్లల్లో..ఈ మధ్య ఇలాంటివి మామూలయ్యాయిలే..మరేం పర్లేదు..” అంటూ ఆ పొట్టి కుర్రాడి చేయి పక్క సీటుకి పట్టించి నిలబెట్టాడాయన.
”థాంక్యూ సర్..”చెప్పాడు కుర్రాడు.
పెద్దాయన మళ్ళీ కళ్ళు మూసుకు కూర్చున్నాడు.
” ఏం సార్..నిద్రపోతున్నారా..” అంటే ఆయన పలకలేదు.ఎక్కేవాళ్ళు ..దిగేవాళ్ళు హదావిడిగానే ఉంది వాతావరణం.సరే మరి పొట్టి కుర్రవాడు పెద్దసార్ జేబులో పర్స్ కొట్టేసే ప్రయత్నంలో ఎంచక్కాదొరికిపోయాడు.వాడు నీళ్ళు నముల్తూ..
” నేనూ..మరి ..మీ ఫోన్ పడిపోబోతుంటే..”
”పట్టుకుని ఇవ్వాలనుకున్నావా..పోనీలే..ఇదేగా లాస్ట్ స్టాప్ దిగెయ్..నీకు కొంచెం చాలా ఆకలిగా ఉంది కదూ..!” అన్నారు పెద్దాయన.
‘అవును సర్..మీకెలా తెలిసిందీ…” కళ్ళవెంట నీళ్ళు జారుతుండగా అడిగాడు పిల్లవాడు.
పెద్దాయన నవ్వుతూ..ప్రక్కనే ఉన్న ఉడిపి హోటల్ లోకి దారి తీస్తూ..
” నీకో ఉద్యోగం ఇప్పిస్తా చేస్తావా..” అన్నాడు.
”లేదు సార్..నేనేమీ చదువుకోలేదు..నాకేపనీ రాదు..ఇది తప్ప ”చెప్పాడు కాస్త సిగ్గు పడుతూ..
” డోంట్ వర్రీ..ఈ ఉద్యోగానికి చదువక్కర్లేదు బాబూ..దర్జాగా బ్రతకాలని ఉంటే చాలు.”
”చెప్పండి సార్ తప్పకుండా చేస్తాను..మీ మేలు ఈ జన్మలో మరచిపోలేను..”దణ్ణం పెడుతూ అడిగాడు.
పెద్దాయన ఆ కుర్రాడికి కడుపునిండా భోజనం పెట్టించి ఒక ఐదువందల రూపాయలిచ్చి తనకు తెలిసిన సెక్యూరిటీ గార్డ్స్ సంస్థలో ఓ గార్డ్ పోస్ట్ కి రికమండ్ చేస్తూ లెటర్ ఇచ్చి ..వెన్ను తట్టి అడ్రస్ ఇచ్చి పంపాడు.
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →