ప్రధాని ప్రత్యేక విమానం ప్రత్యేకతలు
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడికి మనదేశ ప్రధాని ఏ మాత్రం తీసిపోకూడదని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు ఎక్కడికి వెళ్లినా సకల సౌకర్యాలు కలిగిన ప్రత్యేక విమానంలో వెళ్తాడు. ఇది ఆ విమానంలో లేదు అనకుండా అన్నీ ఉంటాయి. అలాంటి విమానాన్ని మన దేశ ప్రధానికి కూడా ఉండాలనే ఉద్దేశంతో కేంద్రం సౌకల సౌకర్యాలుగా కలిగిన విమానాన్ని కొనుగోలు చేయనుంది. ఈ విమానం కొనుగోలుపై ఈ నెల 25న కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. రెండు దశాబ్దాలుగా భారత ప్రధానుల పర్యటనలకోసం బోయింగ్ 747 విమానాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే ఈ విమానాన్ని పక్కన పెట్టి అభివృద్ధి చెందిన దేశాల అధ్యక్షులు, ప్రధానులు పయనించే విమానం లాంటిది కొనుగోలు చేయాలని కేంద్ర రక్షణశాఖ నిర్ణయించింది. ఈ నెల25న జరగనున్న రక్షణశాఖ కొనుగోళ్ల మండలి (డీఏసీ) సమావేశంలో రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్.. అధునాతన విమానం బోయింగ్ 777-800పై అధికారులతో చర్చించనున్నారు.
ప్రధానికిఅంతర్జాతీయ తీవ్రవాద సంస్థల నుంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకొని అత్యాధునిక రక్షణ పరికరాలతో కూడిన విమానంగా కూడా తయారు చేయాలని రక్షణశాఖ భావిస్తున్నట్లు తెలిసింది. ప్రత్యేక రాడార్ గ్రాహక లోహంతో కూడా ఈ విమానాన్ని తయారు చేయనున్నట్లు రక్షణశాఖ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. శత్రువుల రాడార్ కంట పడకుండా ఉండటమే కాకుండా గగనతలంలో ఉన్నప్పుడు శత్రువుల దాడిని ధీటుగా ఎదుర్కొనే విధంగా కూడా ఈ విమానాన్ని రూపొందించనున్నారు.
ప్రత్యేకతలు ఇవీ…
* ప్రధాని కోసం ప్రత్యేక కార్యనిర్వాహక కార్యాలయం 5స్టార్ వసతి గల బెడ్రూం ఏర్పాటు
* తాజా కమ్యూనికేషన్ సౌకర్యాలు
* గ్రేనేడ్, రాకెట్ దాడులను ధీటుగా ఎదుర్కొనే టెక్నాలజీ ఏర్పాటు
* శత్రువుల రాడార్లను జామ్ చేయడమే కాకుండా దారి మళ్లించగలిగే సామర్థ్యం
* క్షిపణి వ్యతిరేక రక్షణ వ్యవస్థల ఏర్పాటు
* రాడార్, క్షిపణి హెచ్చరిక వ్యవస్థలతో పాటు బలమైన రక్షణ వ్యవస్థ ఏర్పాటు
* 2000 మందికి ఆహారాన్ని నిల్వచేసే అవకాశం
* అత్యవసర విషయంలో గగనతలంలోనే ఇంధనాన్ని నింపే సౌకర్యాలు
* ఎల్లవేలలా డాక్టర్ల అందుబాటు, క్లినిక్‌ల ఏర్పాటు
* అత్యవసర చికిత్స కోసం ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు
* బ్రాడ్‌బ్యాండ్, రేడియో,టెలిఫోన్ కనెక్షన్ల ఏర్పాటు
* 19 టివీ సెట్లు
* అధికారులు పనిచేయడానికి తగిన వర్కింగ్ స్టేషన్లు
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.