శివసేనతో సయోథ్యకు మోదీ ప్రయత్నాలు..?
కేంద్రంలో బీజేపీతో శివసేన మిత్రపక్షంగా కొనసాగుతోంది. అయితే రాష్ట్రంలో మాత్రం విడిగా వ్యవహరిస్తోంది. ఈ మధ్య కాలంలో బీజేపీ, శివసే మధ్య అంతరం పెరిగింది. అయితే ప్రధాని మోదీ శివసేనతో సయోథ్యకు ప్రయత్నాలు చేస్తున్నారు. యూపీ ఎన్నికల్లో బీజేపీ అద్వితీయ విజయం సాధించడం పట్ల శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకర్ మోదీకి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఇక ఈ అవకాశాన్ని మోదీ సద్వినియోగం చేసుకున్నారని సమాచారం. ఎన్డీయే మిత్ర పక్షాల భేటీకి హాజరుకావాలని ఆయన కోరారు.
ఇక త్వరలో వీరి మధ్య జరగబోయే భేటీలో శివసేనతో ఉన్న విభేధాలను పరిష్కరించేందుకు మోదీ కృషి చేసే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.ఈ విషయంలో మోదీ చొరవ తీసుకున్నప్పటికీ శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే కూడా అవతల వైపు నుంచి స్పందించాల్సి ఉంటుందని అనుకుంటున్నారు.ఇక ఈ విషయంపై శివసేనకు చెందిన ఓ నేత స్పందించారు. ఉద్ధవ్ థాకరేను పిలిచే విధానంపైనే సమస్య పరిష్కారం ఆధారపడి ఉంటుందని అన్నారు. ఇక ఎన్డీయే విందుకు పలు పార్టీలకు చెందిన నేతలు హాజరవుతారు. అందరిలో ఒకడిగానే ఉద్ధవ్ థాకరేను ట్రీట్ చేస్తారా లేక ప్రత్యేకత ఉంటుందా అన్నది తెలియాల్సి ఉందన్నారు. వాస్తవానికి ఇలాంటి భేటీలకు థాకరే దూరంగా ఉంటారని అన్నారు. కాని సాక్షాత్తు ప్రధాని మోదీ పిలవడంతో హాజరయ్యే అవకాశం లేకపోలేదని అభిప్రాయపడ్డారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.