Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

PM Modi, Listen to 5 Crores Andhra Pradesh People Voice: YS Jagan

By   /  April 12, 2018  /  Comments Off on PM Modi, Listen to 5 Crores Andhra Pradesh People Voice: YS Jagan

    Print       Email

మోడీగారు.. ఐదు కోట్ల ఆంధ్రుల మాట వినండి

InCorpTaxAct
Suvidha

 

 

 

 

* మీరు ఒక్క‌రోజు దీక్ష చేస్తే మా ఎంపీలు ఆరు రోజులుచేశారు

* ప్ర‌త్యేక హోదా కోసం రాష్ట్ర ప్ర‌జ‌లు ఉద్య‌మిస్తూనే ఉన్నారు

* హోదా మా ఊపిరి.. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వండి

* మోడీనుద్దేశించి ట్వీట్ చేసిన వైయ‌స్ జ‌గ‌న్‌

డెక్క‌న్ అబ్రాడ్‌: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇటీవ‌ల కాలంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో కానీ..ఆరోగ్యానికి సంబంధించిన విష‌యంలో కానీ.. పోల‌వ‌రం విష‌యంలో కానీ..ఇలా ఏదైనా ట్విట్ట‌లో స్పందిస్తున్నారు. తాజాగా ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీకి  వైయ‌స్ జగన్ మరోసారి ‘ట్వీట్’ చేశారు. పార్లమెంట్ సమావేశాలు జరిగిన తీరుకు నిరసనగా ఏప్రిల్ 12న బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు దేశవ్యాప్తంగా నిరాహారదీక్షకు దిగిన సంగతి తెలిసిందే. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైయ‌స్‌ జగన్ స్పందించారు. ‘ప్రధానమంత్రి మోదీగారు… మీరు ఈ రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వ‌ని  కారణంగా… 6 రోజుల పాటు నిరాహారదీక్ష చేపట్టిన ఐదుగురు ఏపీ ఎంపీలు ఆసుపత్రిలో ఉన్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల గొంతుకలను దయచేసి వినండి. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చండి’ అంటూ ట్వీట్ చేశారు.

కాగా దేశ వ్యాప్తంగా బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఒక రోజు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి మోదీ తన విధులకు ఆటంకం లేకుండా ఎంపీలతో కలిసి దీక్షలో పాల్గొన్నారు. ఈ నేప‌థ్యంలో ఆ విష‌యాన్ని పేర్కొంటూ ఈ రోజు ట్వీట్ చేయ‌డం సంద‌ర్భోచితంగా ఉంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో వైయ‌స్ జ‌గ‌న్ చూపుతున్న తెగువ‌ను అధికార పార్టీ నేత‌లు సైతం మెచ్చుకోకుండా ఉండ‌లేక‌పోతున్నారు.  ఏది ఏమైనా హోదా విష‌యంలో వైయ‌స్ జ‌గ‌న్ మొద‌టి నుంచి ఒకే స్టాండ్‌మీద ఉండ‌డం ఆయ‌న క‌లిసి వ‌చ్చే అంశ‌మ‌నే చెప్పాలి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →