Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

PM Modi Mann Ki Baath, we will work for modern India

By   /  July 31, 2017  /  Comments Off on PM Modi Mann Ki Baath, we will work for modern India

    Print       Email

వచ్చే ఐదేళ్ళలో కొత్త భారత్ కోసం పనిచేద్దాం: మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ

 

InCorpTaxAct
Suvidha

 

భారత ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవం, జీఎస్టీ, రాజస్థాన్, అసోం రాష్ట్రాల్లో వరద పరిస్థితి గురించి ప్రస్తావించారు.

మన్ కీ బాత్ ముఖ్యాంశాలు..

– ఆర్థిక వ్యవస్థకు జీఎస్టీ సరికొత్త రూపాన్ని ఇచ్చింది. సహకార సమాఖ్యకు ఇది మంచి ఉదాహరణ.ప్రస్తుతం జీఎస్టీ ప్రయోజనాలను అందరూ చూస్తున్నారు. జీఎస్టీని సఫలీకృతం చేసిన భారత ప్రజలకు థన్యవాదాలు.
-గుజరాత్‌, రాజస్థాన్‌, అసోంలలో వరదల పరిస్థితిపై సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నాం. పలుచోట్ల సహాయక చర్యలు చేపడుతున్నాం.హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1078 ఎప్పుడూ పనిచేస్తూనే ఉంది.
-ఆగస్టు భారత్‌ చారిత్రక ఉద్యమాలను గుర్తుచేస్తుంది. 1857 నాటి నుంచి దేశ స్వాతంత్య్రం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. క్విట్‌ ఇండియా ఉద్యమంలో మహాత్మాగాంధీ నాయకత్వం మరవలేనిది. లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ, డాక్టర్‌ లోహియా కూడా క్విట్‌ ఇండియా కోసం పాటుపడ్డారు.
-ఇప్పుడు మన అపరిశుభ్రం వెళ్లిపోవాలి.. పేదరికం పారిపోవాలి.. ఉగ్రవాదం వెళ్లిపోవాలి.. కులతత్వం వెళ్లిపోవాలి.. అని ప్రతిజ్ఞ చేద్దాం.
-స్వాతంత్య్రం కోసం అందరూ ఉద్యమించారు. ఎన్నో త్యాగాలు చేశారు. అయితే ఇప్పుడు మనం త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. దేశాన్ని అభివృద్ధి వైపుకు తీసుకెళ్లాలి.
-దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70ఏళ్లు కావస్తోంది. 2017ను సంకల్ప సంవత్సరంగా తీర్చిదిద్దాలి. రానున్న ఐదేళ్లలో కొత్త భారత్‌ కోసం ఇప్పటి నుంచే కృషి చేద్దాం.
-మహిళల ప్రపంచకప్‌లో భారత మహిళా క్రికెట్‌ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. వారిని చూసి దేశం గర్వపడుతోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →