Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

PM Modi salutes nari-shakti

By   /  March 8, 2016  /  Comments Off on PM Modi salutes nari-shakti

    Print       Email

Indian Prime Minister Narendra Modi greets the audience as he prepares to deliver the 37th Singapore Lecture Monday, Nov. 23, 2015, in Singapore as he starts his two-day official visit to the city-state. (AP Photo/Wong Maye-E)

మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

InCorpTaxAct
Suvidha

 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు వందనం అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సమాజంలో వారి పాత్రకు, వారు సాధిస్తున్న విజయాలకు సెల్యూట్‌ చేశారు. మన ‘నారీ శక్తి’ సాధికారత కోసం తమ సర్కారు కృషి చేస్తోందంటూ మోదీ పేర్కొన్నారు. ‘బేటీ బచావో బేటీ పడావో’ ద్వారా బాలికా విద్యను మెరుగుపరుస్తున్నామన్నారు. నైపుణ్యాభివృద్ధి సెంటర్లు, ముద్రా బ్యాంకు మహిళా సాధికారత దిశగా కృషి చేస్తున్నాయని, ఇది భారత వృద్ధిరేటుకు తోడ్పడుతుందన్నారు. అలాగే ప్రణబ్‌ ముఖర్జీ కూడా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌లో మహిళలకు ఎల్లప్పుడూ అత్యున్నత స్థాయి గౌరవం కల్పిస్తామన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చంద్రబాబు శుభాకాంక్షలు..chandra babu with mike

1911లో మొదటిసారిగా అంతర్జాతీయ మహళా దినోత్సవం జరగిందన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు . అక్కడి నుంచి ప్రపంచం మొత్తం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూన్నారని అన్నారు. మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన శాసనసభలో ప్రసంగించారు. సమాజంలో మహిళలకు జరుగుతున్న అన్యాయం, వివక్ష గురించి సమీక్ష చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏం చేస్తే మహిళలకు న్యాయం జరుగుతుందన్న అంశంపై సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు.స్త్రీ, పురుష సమానత్వం తగ్గిపోయే పరిస్థితి వస్తోందని అన్నారు. ఎక్కడికక్కడ మహిళల సంఖ్య కూడా తగ్గిపోతోందన్నారు. పూర్తిగా నిరాధరణకు గురయ్యే పరిస్థితి వస్తోందన్నారు.

సమాజంలో మహిళలను సమానంగా గౌరవించాలని సూచించారు, అన్ని రంగాల్లో భాగస్వాములను చేస్తే తప్ప అనుకున్న ప్రగతి గానీ, మహిళల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెరిగే పరిస్థితి గాని ఉండదని చంద్రబాబు అభిప్రాయడ్డారు. ఐక్యరాజ్య సమితి చెప్పిన విధంగా 2030కి స్త్రీ పురుష సమానత్వం, మహిళల, బాలిక సాధికారికత ఒక అంశంగా పెట్టుకుని ముందుకు వెళుతున్నామన్నారు. టీడీపీ స్థాపించిన తర్వాత మహిళలకు న్యాయం ఎంతో జరిగిందన్నారు. ఇండియాలో మహిళా వర్సిటీ తెచ్చిన ఘనత ఎన్టీఆర్ దేనని చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కూడా తమ టీడీపీదేనని చెప్పారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించామన్నారు. దేశంలో టెక్నాలజీ పెరగడంతో ఐటీ రంగంలో మహిళలు దూసుకుపోతున్నారని అన్నారు. డ్వాక్రా రుణాలు ఇచ్చి మహిళలను ప్రొత్సహించామని గుర్తు చేశారు. రుణాల పంపిణీలో ఏపీ ఫస్ట్ ప్లేస్ లో ఉందన్నారు.

 

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →