ప్రధాని రాకతో భారీ ఏర్పాట్లు
ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 7న మధ్యాహ్నం ఒంటి గంటకు తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పర్యట నకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఏర్పాట్లను మంత్రి హరీశ్ రావ్ పరిశీలించారు. కార్యకర్తల సమావే శం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. జిల్లాకు మొదటిసారి ప్రధాని రావడం గర్వకారణమని చెప్పారు. ప్రధాని మోదీ బహిరంగ సభకు సిద్దిపేట నియోజకవర్గం నుంచి 25వేల మందిని తరలిస్తామని ఆయన తెలిపారు. అదే రోజు సిద్దిపేట రైల్వేలైన్‌కు ప్రధాని శంకుస్థాపన చేస్తా రని మంత్రి చెప్పారు. మిషన్‌భగీరథ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని హరీశ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి మోదీ రాష్ట్రంలో అడుగు పెట్టబోతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం జగదేవ్ పూర్ పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి హరీష్‌రావు పిలుపు నిచ్చారు.
ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి మోదీకి ఘన స్వాగతం పలకాలని కోరారు. ఈ సమావేశానికి పలువురు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, కార్యకర్త లు హాజరయ్యారు. అనంతరం ఆయన జగదేవ్ పూర్ లో మోదీ పర్యటన కోసం ఏర్పాటు చేస్తోన్న సభాస్థలిని మహేందర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. అంతేకాకుండా ప్రధాని సభ ఏర్పాట్లను ఉన్నతాధికారులు మంగళవారం పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ గజ్వేల్ వచ్చి పరిశీలించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.