రాహుల్ కొబ్బరి జ్యూస్ వ్యాఖ్యలపై మోదీ సెటైర్లు..
మణిపూర్ ఎన్నికల ర్యాలీలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కొబ్బరి జ్యూస్ పై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సెటైర్లు వేసింది. దీనిపై మణిపూర్ ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడారు. నిన్న ఓ కాంగ్రెస్ నేత కొబ్బరికాయల నుంచి జ్యూస్ చేస్తామన్నారని గుర్తు చేశారు. తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఇంగ్లండ్ లో అమ్ముతాని చెప్పారని అన్నారు. కొబ్బరి కాయ నుంచి వచ్చేవి నీళ్ళు మాత్రమేనని చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడని అన్నారు. అసలు కొబ్బరి జ్యూస్ గురించి ఇప్పటివరకు ఎవరైనా ఎప్పుడైనా విన్నారా..? అంటూ ప్రశ్నించారు. దీని గురించి నాకు తెలీదు..మీరైనా చెప్పండి ప్లీజ్ అంటూ వ్యాఖ్యానించారు. కొబ్బరికాయలు కేరళలో దొరుకుతాయి. కాని కాంగ్రెస్ నేత మాత్రం కొబ్బరి జ్యూస్ చెప్పుకొచ్చారు. ఇక్కడ నిమ్మకాయలు, నారింజ, పైనాపిల్ ని సాగు చేస్తారు. త్వరలో లండన్ లో పైనాపిల్ జ్యూస్ బాక్స్ పై మేడిన్ మణిపూర్ అని వస్తుందని ఆశిస్తున్నాను అంటూ మోదీ సెటైర్ వేశారు.
మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది. జోక్స్ వేయడంలో మోదీ దిట్ట అని అన్నారు. సరిగా రాహుల్ స్పీచ్ ని పరిశీలించాన్నారు. స్పీచ్ లో రాహుల్ వాస్తవాలను చెప్పారని అది పూర్తిగా వింటే జోక్ లు వేయరని అన్నారు. మోదీకి జోక్స్ వేయాలని ఉంటే సిద్ధూతో చెప్పి కపిల్ శర్మ షోలో అవకాశం ఇప్పిస్తామన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నేత సుర్జేవాలా వ్యాఖ్యానించారు. నిజానికి రాహుల్ నారంగి అని పలకబోయి నారియాళ్ అని పలికారని అన్నారు. దీనిపై ఇంత రాద్ధాతం అవసరం లేదని అన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.