Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

PM Narendra Modi visits Lord Shiva temple in Oman

By   /  February 13, 2018  /  Comments Off on PM Narendra Modi visits Lord Shiva temple in Oman

    Print       Email

మస్కట్‌లోని శివాలయంలో పూజలు చేసిన ప్రధాని మోదీ..!

 

Suvidha
Biryani Pot

 

 

భారత ప్రధాని నరేంద్ర మోదీ నాలుగురోజుల పర్యటనలో భాగంగా మస్కట్‌లోని మత్రాహ్ ఏరియాలో ఉన్న 125 ఏళ్ల పురాతన శివాలయాన్ని సందర్శించారు. ఆద్యాత్మికతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రధానికి దైవ భక్తి కూడా ఎక్కువే. శివాలయాన్ని సందర్శించిన ఆయన ఆలయంలో పూజలు చేసిన అనతరం వెలుపలే వేచియున్న భారతీయ సంతతికి చెందిన వారితో ఆయన ముచ్చటించారు. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అతి పురాతన ఆలయాల్లో ఈ శివాలయం ఒకటి.

ఒమన్ సుల్తాన్ ప్యాలెస్‌కు సమీపంలో ఉన్న ఈ ఆలయాన్ని గుజరాత్‌కు చెందిన వ్యాపార వర్గాలు 125 ఏళ్ల క్రితం నిర్మించారు. 1999లో దీనిని పునరుద్ధరించారు. ఈ ఆలయంలో ప్రధాన దేవతామూర్తులుగా శ్రీ ఆది మోతీశ్వర్ మహదేవ్, శ్రీ మోతీశ్వర్ మహదేవ్, శ్రీ హనుమాన్‌జీ ఉన్నారు. పండుగలు, ప్రధాన ఉత్సవాల్లో ఈ ఆలయాన్ని 15,000 మందికి పైగా భక్తులు దర్శిస్తుంటారు.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Undalli Arun Kumar hope on Pawan Kalyan JFC

Read More →