Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

PM praises President Pranab Mukharji

By   /  July 27, 2016  /  Comments Off on PM praises President Pranab Mukharji

    Print       Email

modiమోడీ పొగ‌డ్త‌కూ ఓ లెక్కుంది!

 

InCorpTaxAct
Suvidha

 

 

దేశ ప్ర‌ధాని అంత‌టి వాడు పొగిడేశారంటే ఎవ‌రైనా గంతులేస్తారు. కానీ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పొగిడితే మాత్రం భ‌య‌ప‌డుతున్నారు. అది అధికారులైనా.. రాజ‌కీయా నాయ‌కులైన‌. మోడీ పొగ‌డ్త‌కు ఓ లెక్క ఉంటుందని.. అందుకే ఆయ‌న పొగిడేస్తార‌ని వారంటున్నారు. మ‌రీ ముఖ్యంగా మోడీకి న‌చ్చ‌ని వాళ్ల‌నే ఎక్కువ‌గా పొగిడేస్తారంటున్నారు. మొన్నటికి మొన్న ఆర్ బీఐ గవర్నర్ రఘురాం రాజన్ ను ఉద్దేశించి విపరీతంగా పొగిడేసిన ఆయన.. యూపీఏ హయాంలో నియమించిన ఆయన్ను ఇంటికి పంపేశారు. ఆయన శక్తి సామర్థ్యాల్ని విపరీతంగా పొగిడేసిన మోడీ.. ఆయనకు మరో టర్మ్ అవకాశం ఇచ్చే ‘పవర్’ తనకున్నా.. ఆ పని మాత్రం చేయలేదు. తాజాగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖ‌ర్జీని ఉద్దేశించి మోడీ విపరీతంగా పొగిడేశారు. నిజానికి వీరిద్దరిది భిన్న ధ్రువాలు. ప్రణబ్ ముఖ‌ర్జీ కరుడు కట్టిన కాంగ్రెస్ వాది అన్న విషయం దేశంలోని ప్రతి ఒక్కరికి తెలిసిందే. అదే సమయంలో మోడీలో బీజేపీ భావజాలం ఎంతన్నది ఎవరికి వివరించి చెప్పాల్సిన అవసరం ఉండదు.

రెండు భిన్న ధ్రువాలు ఎప్పటికి కలుసుకోలేవు.కానీ.. తమకున్న పరిమితులతో హుందాగా వ్యవహరించటం మామూలే. అయితే.. అందుకు భిన్నంగా ప్రణబ్ ముఖ‌ర్జీని తన గురువుగా.. మార్గదర్శకుడిగా పొగిడేయటం మోడీ మార్క్ గా చెప్పాలి. మరింతగా పొగిడేస్తున్న ప్రణబ్ ముఖ‌ర్జీని  మరోసారి రాష్ట్రపతి పీఠం మీద మోడీ కూర్చోబెడతారా? అన్న ప్రశ్న వేసుకుంటే.. మోడీ పొగడ్తల్లో మర్మం ఇట్టే అర్థమవుతుంది. అందరి మనసుల్ని దోచుకోవటానికి వీలుగా టైలర్ మేడ్ వ్యాఖ్యలు చేసే ఆయన.. మాటలు ఇంత తియ్యగా చెబుతూ.. చేతల్లో చేయాల్సింది చేసేస్తుంటారు. తాజాగా ప్రణబ్ ముఖ‌ర్జీ  విషయంలోనూ అంతే. వచ్చే ఏడాది పదవీ కాలం పూర్తి కానున్న ప్రణబ్ ముఖ‌ర్జీని పొగిడేయటం ద్వారా.. మోడీ చెప్పకనే చెప్పింది ఒక్కటే.. తనను అందరికి ఆమోదయోగ్యుడైన వ్యక్తినని చాటుకోవటం.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మోడీ ఎవరినైతే గురువుగా అభివర్ణిస్తారో వారిని పూర్తిగా పక్కన పెట్టేయం కనిపిస్తుంది.మోడీని ఎంతగానో ప్రమోట్ చేసిన ఆయన రియల్ గురువు అద్వానీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రాష్ట్రపతి ప్రణబ్ దాను కూడా మోడీ గురువుగా.. సంరక్షకుడిగా అభివర్ణించటం చూస్తే మోడీ తెలివిని చూసి మురిసిపోకుండా ఉండలేం

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →